JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
JioCinema: ఓటీటీ వచ్చాక సినిమాలన్నీ దాదాపు ఇంట్లో కూర్చుని చూస్తున్నారు. అయితే, దానికి సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. అయితే, ఇప్పుడు జియో యాప్ సబ్ స్క్రిప్షన్ రేట్లు కూడా భారీగా తగ్గించింది.
JioCinema slashes subscription prices: ఓటీటీ.. సినిమా లవర్స్‌కు ఇదొక వరం అనే చెప్పాలి. లోకల్, ఇంటర్నేషనల్ అనే తేడా లేకుండా ఏ భాష మూవీ అయినా చూసేయొచ్చు. హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అన్ని సినిమాలను ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అయితే, దానికి సంబంధించిన సబ్ స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, డబ్బులు బాగానే ఖర్చవుతాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సబ్ స్క్రిప్షన్ రేట్లలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కేవలం నెలకు రూ.29 కడితే చాలు.. హాలీవుడ్ తో పాటు అన్ని సినిమాలు చూడొచ్చు అని ప్రకటించింది. ప్రీమియం కంటెంట్ మొత్తం కూడా 4కే క్వాలిటీలో చూడవచ్చు.
ఎంత తగ్గించిందంటే?
ఒకప్పుడు జియో సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.99, ఏడాదికి రూ.999 ఉండేది. అయితే, ఇప్పుడు దాంట్లో మూడింట రెండు వంతులు తగ్గించింది జియో. ఇప్పుడు రూ.29కే నెల సబ్ స్క్రిప్షన్ను తగ్గించినట్లు వయాకామ్ 18 ప్రకటించింది. "4కే క్వాలిటీతో, బెస్ట్ ఆడియో, ఆఫ్ లైన్ లో చూసే విధంగా, డివైజ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇండియా మొత్తానికి క్వాలీటీ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టాం. ఈ ప్లాన్ లో ఇంటర్నేషనల్ సినిమాలన్నీ కూడా ఆఫ్ లైన్ లో చూసే అవకాశం ఉంది. టీవీ సీరియళ్లు, కిడ్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఒకేసారి నాలుగు డివైజుల్లో చూడొచ్చు. ఐదు భాషల్లో అన్ని ప్రొగ్రామ్ లు అందుబాటులో ఉంటాయి" అని ప్రకటించారు వయాకామ్ 18 సీఈవో కిరణ్ మణి. ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుంది అని ప్రకటించింది కంపెనీ. ఇదంతా యాడ్ ఫ్రీ కంటెంట్ అని, ఎక్స్ క్లూజివ్ సిరీస్, సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, కిడ్స్, టీవీ ఎంటర్ టైన్మెంట్ అన్ని టీవీలో, ఫోన్ లో ఏ డివైజ్ లో అయినా చూడొచ్చని చెప్పింది.
ఫ్యామిలీ ప్లాన్ కూడా..
జియో.. ఫ్యామిలీ ప్లాన్ కూడా ప్రకటించింది. నెలకు రూ.89తో సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. ఒకేసారి నాలుగు స్కీన్స్ లో కంటెంట్ చూడొచ్చు. ఇక ఇప్పటికే జియో ప్రీమియమ్ మెంబర్ షిప్ లో ఉన్న వాళ్లకు మాత్రం ఎలాంటి ఎక్స్ ట్రా కాస్ట్ లేకుండా ఫ్యామిలీ ప్లాన్ బెనిఫిట్స్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్ ఫ్రీగా ఉండగా దాన్ని అలానే కొనసాగిస్తున్నట్లు చెప్పింది. వేల గంటల ఎంటర్ టైన్మెంట్ కంటెంట్ ఫ్రీగా చూడొచ్చు, యాడ్ సపోర్ట్ ఆఫర్ లో దాన్ని ఫ్రీగా అందిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోస్ అయిన పీకాక్, హెచ్ బీ వో, పారామౌంట్, వార్నర్ బ్రోస్ డిస్కవరీలతో ఒప్పందం కుదుర్చుకుంది జియో. దీంతో ప్రీమియమ్ మెంబర్స్ దాంట్లో వచ్చే సూపర్ కంటెంట్ ఫ్రీగా చూడొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఓపెన్ హైమర్, బార్బీ లాంటి టాప్ సినిమాలు, సిరీస్ లు కూడా ఇక నుంచి జియోలో చూడొచ్చు. అవన్నీ తెలుగు, తమిళ్, హిందీ, బెంగాళీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా టీవీ ఛానెల్స్ కంటే ముందే జియో యాప్ లో కంటెంట్ చూసే విధంగా ఆఫర్ ఇచ్చింది జియో. దాంతో పాటుగా.. 20కి పైగా ఉన్న వయాకామ్ నెట్ వర్క్ ఛానెల్స్ ని కూడా జియోలో చూడొచ్చు.
Also Read: సీనియర్ నటి రాధ కోసం స్పెషల్ బిర్యానీ చేసిన ఆలీ భార్య - చూస్తే నోరూరుతుంది