Jayam Ravi Aarti: జయం రవి విడాకుల కేసు - రూ.40 లక్షల భరణం కోరుతూ ఆర్తి రవి పిటిషన్
Ravi Mohan: జయం రవి, ఆర్తి రవి డివోర్స్ వ్యవహారం మరోసారి కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తన భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Jayam Ravi's Wife Aarti Ravi Petition For Alimony: కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆర్తి రవి భరణం కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు.
రూ.40 లక్షల భరణం ఇవ్వాలంటూ..
తన భార్య ఆర్తి రవితో డివోర్స్ తీసుకున్నానంటూ జయం రవి గతేడాది సంచలన ప్రకటన చేశారు. అయితే, కేసు ఇంకా కోర్టులోనే ఉందని.. అఫీషియల్‌గా డివోర్స్ కాలేదంటూ ఇటీవలే ఆర్తి రవి వెల్లడించారు. డివోర్స్ కేసుకు సంబంధించి ఇద్దరూ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించింది.
అయితే, ఆర్తితో వివాహ బంధాన్ని కొనసాగించలేనని జయం రవి చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ విడాకులు మంజూరు చేయాలని ఆయన లీగల్ టీం కోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డివోర్స్ కోరుతున్న తన భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ ఆర్తి రవి కోర్టును ఆశ్రయించారు. జయం రవి నుంచి తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.
Also Read: 'హరిహర వీరమల్లు' నుంచి తుపాన్ వచ్చేసింది - పవర్ ఫుల్ 'అసుర హననం' సాంగ్ చూశారా?
పవర్, మనీ కాదు
జయం రవి గతేడాది విడాకులపై ప్రకటన చేయగా.. తనను సంప్రదించకుండానే ప్రకటించారంటూ ఆర్తి రవి ఆరోపించారు. సింగర్ కెనీషాతో ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్‌పై మరోసారి రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై స్పందించిన ఆర్తి.. ఓ పోస్ట్ చేయగా.. దానిపై సింగర్ కెనీషా ఇండైరెక్ట్‌గా, జయం రవి నేరుగా స్పందించారు. దీంతో మళ్లీ వీరి వ్యవహారం చర్చకు దారి తీసింది.
ఇటీవలే ఆర్తి మరో పోస్ట్ పెట్టారు. తాము విడిపోవడానికి పవర్, మనీ కారణం కాదని.. మూడో వ్యక్తే కారణమంటూ తెలిపారు. ఈ విషయాన్ని తాను ఊహించి చెప్పడం లేదని.. తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 'నా భర్తను జాగ్రత్తగా చూసుకోవడం, చెడు అలవాట్ల నుంచి కాపాడుకోవడం సాధ్యమవుతుందా?, భర్త ఆరోగ్యం కోసం ఏ భార్య అయినా ఇలానే చేస్తుంది. సానుభూతి కోసం ఏ తల్లీ పిల్లలను వాడుకోదు. అతని కెరీర్ కోసం 15 ఏళ్లుగా నా కలలు, నా మాస్టర్స్ డిగ్రీ త్యాగం చేశాను. జీవితాంతం నాతోనే ఉంటానని ప్రమాణం చేసి ఇప్పుడు మాట తప్పాడు. ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తా. నేను బలహీనవంతురాలిని కాదు. ఇకపై ఏం చెప్పను. న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది.' అంటూ సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు.





















