Jaya Krishna Ghattamaneni: అప్పుడు మహేష్ బాబును... ఇప్పుడు ఆయన అన్న కొడుకును... జయకృష్ణ ఎంట్రీకి అంతా రెడీ!
Jaya Krishna Ghattamaneni Debut Movie: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న (రమేష్ బాబు) కొడుకు జయకృష్ణ ఘట్టమనేని ఎంట్రీకి అంతా రెడీ అయ్యింది. రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఆయన్ను లాంచ్ చేయనున్నాయి.

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య (దివంగత కథానాయకుడు రమేష్ బాబు) కుమారుడు జయకృష్ణ అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆయన సినీ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం', 'మంగళవారం' వంటి హిట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో తెలుసా?
అటు వైజయంతి... ఇటు ఆనంది ఆర్ట్స్!
జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో పరిచయం కానున్న సినిమాను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర నిర్మాణ సంస్థలు తెరకెక్కించనున్నాయి.
మహేష్ బాబును 'రాజకుమారుడు'తో వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ పరిచయం చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ సహా తెలుగులో చాలా మంది హీరోలను ఆయన పరిచయం చేశారు. ఇప్పుడు జయకృష్ణను తెలుగు తెరకు ఆయన పరిచయం చేయనున్నారు. ఆయనతో పాటు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ అధినేత పి కిరణ్ (జెమిని) కిరణ్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆల్రెడీ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించారట. సినిమా డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టు భారీ బడ్జెయ్ కేటాయించారట.
లండన్‌లో జయకృష్ణకు యాక్టింగ్ ట్రైనింగ్!
ప్రస్తుతం జయకృష్ణ ఘట్టమనేని లండన్‌లో ఉన్నారు. అక్కడ ప్రొఫెషనల్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జయకృష్ణ హ్యాండ్సమ్ లుక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేశాయి. ఈ సినిమాను మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రొడక్షన్ వేల్యూస్ నుంచి టెక్నికల్ అంశాల వరకు అన్నిటిలో బెస్ట్ ఉండాలని నిర్మాతలకు చెప్పారట.





















