Janhvi Kapoor: ఎన్టీఆర్‌కు ఒక్క సెకన్ చాలు, అదే నాకైతే 10 రోజులు - తారక్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Janhvi Kapoor about Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని, ఆయన డ్యాన్స్ స్పీడ్ చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పింది.
Janhvi Kapoor About Jr NTR Energy and Dance: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం హిందీలో ‘ఉలఝ్’ మూవీతో బిజీగా ఉంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో జాన్వీ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ తన తెలుగు ప్రాజెక్ట్స్‌పై స్పందించింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కాగా ప్రస్తుతం జాన్వీ తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్ చరణ్ RC15 మూవీ ఒకటి. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు మూవీ షూటింగ్ చివరి వరకు చేరుకుంది. అయితే ఇటీవల ఎన్టీఆర్-జాన్వీ కపూర్‌ల మధ్య ఓ సాంగ్ చిత్రీకరణ జరిగిందని జాన్వీ ‘ఉలఝ్’ ప్రమోషన్స్ వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు సినిమాలో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. తెలుగువారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారంది. అంతేకాదు ఇతురలతో హుందాగా ప్రవర్తిస్తారని పేర్కొంది. "తెలుగు వారితో పనితీరు నాకు బాగా నచ్చింది. వారు కళను, సినిమాను చాలా గౌరవిస్తారు. ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కథపై నమ్మకంతో పని చేస్తారు. దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయాన్నినా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం సులభం" అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించింది.
"దేవరలో నేను జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నా. ఆయన ఎనర్జిటిక్ హీరో. ఆయన సెట్‌కి రాగానే సందడి వాతావరణం నెలకొంటుంది. అందరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన రాగానే సెట్‌కి కళ వస్తుంది. ఇటీవల మా ఇద్దరి మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇందులో ఎన్టీఆర్ ఎనర్జీకి చూసి షాక్ అయ్యా. ఆయన చాలా స్పీడ్ అండ్ ఎనర్జీతో డ్యాన్స్ చేయగలరు. ఏ విషయాన్ని అయినా ఆయన సెకన్స్‌లో నేర్చుకుంటారు. అదే నాకు అయితే 10 రోజులు పడుతుంది(నవ్వుతూ). అందుకే సెకండ్ సాంగ్‌కి ఇప్పుడే నేను ప్రాక్టీస్ మొదలు పెట్టాను" అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
అనంతరం తన హెల్త్‌పై స్పందించింది. ఇటీవల నేను అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాను. ప్రస్తుతం కోలుకున్నా అని వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్,రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె దేవర మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
Also Read: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?