Janhvi Kapoor: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్ కామెంట్స్
janhvi Kapoor at Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో పాల్గొన్న జాన్వీ తన తల్లి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆమె ఎప్పుడు తను యాక్టర్ అవ్వాలని కోరుకోలేదు అని చెప్పి షాకిచ్చింది.
Janhvi Kapoor reveals Sridevi did not want her to be an actor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించి లేటెస్ట్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి'. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల థియేటర్లోకి వచ్చింది. ఇందులో జాన్వీ టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావుకు జోడిగా నటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌కు తెచ్చుకుంది. అయితే ఇందులో జాన్వీ నటనకు ప్రశంసలు దక్కాయి. తన మూవీ రిలీజ్ నేపథ్యంలో కొద్ది రోజులు ఈ ఆమె మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు తమ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ కామెడీ షో, ది గ్రే ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు.
ఈ షోకు గెస్ట్‌గా వెళ్లిన వారిని కపిల్ శర్మ తనదైన కామెడీ, చిక్కు ప్రశ్నలతో ఆటాడుకున్నాడు. ముఖ్యంగా జాన్వీ కపూర్‌ని తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పేరుతో ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే ఈ షోలో జాన్వీ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి చెప్పుకొచ్చింది. శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో జాన్వీ మాట్లాడుతూ.. తన తల్లి(శ్రీదేవి) ఎప్పుడు కూడా తనని యాక్టర్ చేయాలని అనుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
"మా ఎప్పుడు నన్ను యాక్టింగ్ తప్ప మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకోమని చెప్పేది. తనకు నేను డాక్టర్ అవ్వాలని కోరిక. అందుకే నన్నేప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంచేది. ఎప్పుడు బయటకు వచ్చిన నన్ను మీడియాకు, కెమెరాలకు దూరంగా ఉండమనేది. చాలా సంవత్సరాలు నన్ను నటనకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది. ఎక్కడ నేను యాక్టింగ్ కెరీర్ ఎంచుకుంటానేమో అని తను భయపడుతుండేది. చిన్నప్పుడు నేను అద్దం ముందు నిలుచుని స్టైల్ పోతున్నప్పుడల్లా వారించేది. నాకు నిన్ను డాక్టర్ చూడాలనేది నా కల అని చెబుతూ ఉండేది" అంటూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత జాన్వీ మాట్లాడుతూ.. "అమ్మ నన్ను డాక్టర్ కావాలని చెబుతున్నప్పుడల్లా నేను యాక్టర్ అవుతాను అని చెప్పేదాన్ని. 'చిన్నప్పుడే నేను నటిని అవ్వాలని నిర్ణయించుకున్నాను. నన్ను డాక్టర్‌గా చూడాలన్నా నీ కల నేర్చవేడానికి తన సినిమాలో ఏదైనా డాక్టర్ పాత్ర చేస్తాను' అంటూ అమ్మకు చెబుతుండేదాన్ని" అని తల్లిని గుర్తు చేసుకుని జాన్వీ ఎమోషనల్ అయ్యింది. కాగా ఇండస్ట్రీలో శ్రీదేవి క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు లేడీ సూపర్ స్టార్‌గా ఆమె గుర్తింపు పొందింది. అంతేకాదు అతిలోక సుందరికి అందరి చేత మన్నలు పొందింది. వెండితెరపై ఆమె అందం, అభినాయానికి ఆడియన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యేవారు. అంతగా తన అందంతో అందరిని మంత్రముగ్ధులను చేసిన శ్రీదేవి 2018లో ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్లో అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.
Also Read: సౌత్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే - హీరో సూర్యతో రొమాన్స్, ఏ సినిమాలో అంటే..