అన్వేషించండి

Pooja Hegde: సౌత్‌లో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన పూజా హెగ్డే - హీరో సూర్యతో రొమాన్స్‌, ఏ సినిమాలో అంటే..

Pooja Hegde: పూజా హెగ్డే మళ్లీ సౌత్‌లో మంచి కంబ్యాక్‌ ఇవ్వబోతుంది. తాజాగా ఈ బ్యూటీ బంపర్‌ ఆఫర్ కొట్టేసింది. కొద్ది రోజులుగా ఆఫర్స్‌ లేని ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది.

Pooja Hegde Welcome Aboard to Suriya 44 Movie: చాలా గ్యాప్‌ తర్వాత పూజా హెగ్డే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. కొద్ది రోజులుగా సరైన ఆఫర్స్‌ లేక ఈ బుట్టబొమ్మ సైలెంట్‌ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్‌లతో వరుస ప్లాప్స్‌ చూసి ఈ భామ కెరీర్‌కు బ్రేక్‌ పడింది. ఇక్కడ క్రేజ్‌ తగ్గడంతో బాలీవుడ్‌ బాట పట్టిన పూజకు అక్కడ కూడా కలిసి రాలేదని చెప్పాలి. బాలీవుడు భాయిజాన్‌ సల్మాన్ ఖాన్‌తో కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీలో జతకట్టింది. ఈ చిత్రపై పూజా ఎన్నో హోప్స్‌ పెట్టుకుంది.

కానీ, ఇది ఆమెకు ఆశించిన విజయం ఇవ్వలేదు. బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం డిజాస్టర్‌ కావడంతో హిందీలోనూ ఆమెను పెద్దగా దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం హిందీలో దేవా అనే మూవీ చేస్తుంది. ఇప్పుడు పూజా ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకుంటుంది. ఇక సౌత్‌లో బీస్ట్‌తో భారీ పరావడం చూసిన పూజా కోలీవుడ్‌లోనూ అవకాశాలు రావడం కష్టం అనుకున్నారు. తెలుగు, తమిళంలో ఇక పూజా కెరీర్‌ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే కోలీవుడ్‌లో ఆమె ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. 

కోలీవుడ్‌లో ఇటీవల ఓ క్రేజీ కాంబో సెట్‌ అయిన సంగతి తెలిసిందే. అదే కార్తీక్‌ సుబ్బరాజు, సూర్య ప్రాజెక్ట్‌. సూర్య 44వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. #Suriya44 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా ఫిక్స్‌ అయ్యింది. స్వయంగా ఈ విషయాన్ని కార్తీక్‌ సుబ్బరాజు ఆఫీషియల్‌గా వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాలోని పూజా ఫస్ట్‌లుక్ కూడా‌ విడుదల చేసి ఆమెను సెట్‌లోకి ఆహ్వానించారు సుబ్బరాజు. దీంతో పూజా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందంటూ ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ ఈ బుట్టబొమ్మ మంచి కంబ్యాక్‌ ఇవ్వాలని, మళ్లీ ఎప్పటిలాగే వరుస సినిమాలతో అలరించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

కాగా ఇంకా సెట్స్‌పైకి రాని ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుందట. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అండమాన్‌ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఈ చిత్రం కోసం పలువురు స్టార్ టెక్నీషియన్లు పనిచేస్తుండటం మరో విశేషం. అయితే సుబ్బరాజుర షేర్‌ చేసిన తొలి పోస్టర్‌లో మాత్రం పూజా పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించడం మూవీపై అంచనాలు పెంచుతుంది. మరి సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. 

Also Read: రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్‌ చేయనన్న అల్లు అర్జున్ - బన్నీపై ప్రశంసలు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget