Allu Arjun: రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ యాడ్ చేయనన్న అల్లు అర్జున్ - బన్నీపై ప్రశంసలు..
Aallu Arjun Rejects Rs 10 Crore Commercial Ad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పది కోట్ల రూపాయలను కమర్షియల్ యాడ్‌ను తిరస్కరించారట. తన అభిమానులు, ఫాలోవర్స్ దృష్ట్యా ఈ ప్రకటన చేయనన్నారట.
Allu Arjun Rejected Rs 10 Crore Offer Tv Commercial Ad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన డ్యాన్స్, మ్యానరిజం, స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ముఖ్యంగా బన్నీ మ్యానరిజానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన పర్సనాలిటీ పరంగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతోమందికి ఇన్‌స్పైర్‌గా ఉన్నాడు. అయితే పుష్ప మూవీతో బన్నీకి నేషనల్ వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో అతడి క్రేజ్‌ని పలు బ్రాండ్స్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయనకు దగ్గరకు ఎన్నో కమర్షియల్ యాడ్ ఆఫర్స్ వచ్చాయి.
అలాగే ఓ టుబాకో, లిక్కర్ ఉత్పత్తుల కంపెనీలు కూడా ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించాలని కోరాయి. దీనిపై గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే మే 31న 'వరల్డ్ నో నేషనల్ టుబాకో డే' (World No Tobacco Day) సందర్భంగా మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా తమ పొగాకు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరిన సదరు సంస్థ డిల్‌ను బన్నీ మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు కూడా. ఈ విషయమై ఆయనను పలుమార్లు సంప్రదించినా.. తమ ప్రకటనలో నటించనంటూ తేల్చి చెప్పారట. అంతేకాదు తన అభిమానులు, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించి వారి ఆరోగ్యానికి హాని కలిగించేలా తను ప్రవర్తించని సదరు సంస్థతో అన్నారట.
కాగా డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష్ వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీతో బన్నీ నేషనల్ వైడ్‌గా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ హిట్ కావడం, ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దీంతో బన్నీ క్రేజ్ చూసి ఓ పొగాకు ఉత్పత్తుల సంస్థ బన్నీని సంప్రదించిందట. తమ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్వవహరించాలని భారీగా ఆఫర్ ఇచ్చారట. కాన్నీ అల్లు అర్జున్ మాత్రం తాను ఈ ప్రకటనలో అసలు నటించనని చెప్పారట. ఆయన ఒప్పుకోకపోవడంతో సదరు సంస్థ దాదాపు రూ. 10 కోట్లు ఆఫర్ ఇచ్చినా కూడా నిర్మొహమాటంగా నో చెప్పారట. కనీసం ఆయన ఈ యాడ్ చేయకపోయినా.. తన చిత్రం పుష్ప: ది రూల్‌లో ఎక్కడ సిగరేట్ కాల్చే సన్నివేశం వచ్చినా.. తమ ఉత్పత్తుల లోగో ఉండేలా అయినా చూడమని కోరాట. దానికి కూడా అసలు ఒప్పుకోలేదు.
Also Read: మలైకా, అర్జున్ కపూర్ బ్రేకప్ - డిఫరెంట్ పోస్టులతో క్లారిటీ ఇస్తున్న జంట
ప్రస్తుతం ఈ అంశం నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. ఇది గతంలోని వార్తే అయినా మే 31 నో టుబాకో డే సందర్భంగా అల్లు అర్జున్ ఈ టుబాకో యాడ్ తిరస్కరించి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా బన్నీ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలను చూసి సాధారణ ప్రజలు ఇన్‌స్పైర్ అవుతున్నారని, ఈ క్రమంలో వారు ఏం చేస్తే అదే ప్రజలు ఫాలో అవుతారు. అది ద్రష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ రూ.10 కోట్ల ఆఫర్‌ని కూడా మరో మాట లేకుండా తిరస్కరించడం నిజం ఇది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ఫ 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.