అన్వేషించండి

క్రేజీ రూమర్: అయ్యగారితో అతిలోక సుందరి కూతురు రొమాన్స్?

అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ డెబ్యూ డైరెక్టర్ తో చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎంతో కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం కష్టపడుతున్న అక్కినేని వారసుడు అఖిల్ కు 'ఏజెంట్' సినిమాతో తీవ్ర నిరాశే ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్.. తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
 
నిజానికి 'ఏజెంట్' సెట్స్ మీద వుండగానే అఖిల్ తన తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. #Akhil6 మూవీ టాలీవుడ్ బడా బ్యానర్స్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ లలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి అనిల్ కుమార్ అనే ఓ డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 
 
అనిల్ కుమార్ గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ & రైటర్ గా వర్క్ చేశాడు. ఇప్పుడు అఖిల్ కోసం ఓ అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కథను రెడీ చేశాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని, అఖిల్ కు స్టోరీ బాగా నచ్చిందని ఇన్సైడ్ టాక్. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారట.
 
యూవీ బ్యానర్ లో అఖిల్ చేయబోయే ఫాంటసీ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల మేకర్స్ జాన్వీని సంప్రదించారని.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా 'ధడక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తల్లి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. యువ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అమ్మడిని ఎప్పటి నుంచో టాలీవుడ్ కు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టకేలకు NTR30 ప్రాజెక్ట్ సెట్ అయింది.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చేస్తోంది. నందమూరి వారసుడి సరసన నటిస్తున్న ఈ అందాల భామ.. ఇదే క్రమంలో అక్కినేని వారసుడితో రొమాన్స్ చేయడానికి రెడీ అయిందని.. అఖిల్6 చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ అవకాశాన్ని చేజిక్కించుకుందని అంటున్నారు. 
 
జాన్వీ తల్లి శ్రీదేవి మరియు అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున గతంలో హీరో హీరోయిన్లుగా కలసి నటించారు. ఇప్పుడు జాన్వీ - అఖిల్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కు ట్రీట్ అనే చెప్పాలి. మరి త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget