Janhvi Kapoor: జాన్వీ కపూర్ బంపర్ ఆఫర్ - శ్రీదేవి ఇంట్లో ఉండేందుకు అరుదైన అవకాశం, మీరు సిద్ధమేనా?
Janhvi Kapoor: హోటల్ బుకింగ్స్ విషయంలో ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకున్న ఎయిర్ బీఎన్‌బీ.. ఇప్పుడు ఒక కొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. జాన్వీ కపూర్‌తో కలిసి తన ఇంట్లో ఉండే అవకాశం కల్పిస్తోంది.
Janhvi Kapoor Chennai Home: ఈరోజుల్లో ప్రతీ యాప్.. తమ కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం కొత్త కొత్త ఐడియాలతో సిద్ధమవుతున్నాయి. అలాగే ఎయిర్ బీఎన్‌బీ కూడా ఒక కొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది. ఎయిర్ బీఎన్‌బీ అనేది మనం ఉన్న ప్రాంతంలో కొన్నిరోజులు స్టే చేయడానికి హోటల్స్, హోమ్ స్టేలను సజెక్ట్ చేసే యాప్. ఈ యాప్ యాజమాన్యం తమ యూజర్లను మరింత అట్రాక్ట్ చేయడం కోసం సెలబ్రిటీల ఇంట్లో ఉండవచ్చు అనే ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 మంది సెలబ్రిటీలను సెలక్ట్ చేయగా.. అందులో జాన్వీ కపూర్ కూడా ఒకరు. అంటే ఎయిర్ బీఎన్‌బీ యూజర్లు.. జాన్వీ కపూర్ ఇంట్లో ఉండే అవకాశాన్ని పొందవచ్చు.
కండీషన్స్ అప్లై..
ప్రస్తుతం జాన్వీ కపూర్ పేరు మీద ఉన్న చెన్నై ఇల్లును తన తల్లి శ్రీదేవి ఇష్టంగా కొనుక్కుంది. ఆమె మరణించిన తర్వాత ఇల్లు జాన్వీ సొంతమయ్యింది. తాజాగా ఈ ఇంటిని ఎయిర్ బీఎన్‌బీ.. తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడంతో పాటు ఈ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఆ ఇంట్లో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ‘బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్‌లాగా జీవించండి’ అంటూ తన ఇంటి ఫోటోలను షేర్ చేసింది ఎయిర్ బీఎన్‌బీ. తన ఇంటికి రావాలనుకుంటున్న గెస్ట్‌లను జాన్వీ స్వయంగా ఆహ్వానించనుంది అని కూడా తెలిపింది. కానీ దానికోసం ఎయిర్ బీఎన్‌బీ కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది.
వాటికి మాత్రమే యాక్సెస్..
జాన్వీ కపూర్ ఇంట్లో ఉండడానికి కేవలం ఇద్దరు గెస్టులకు మాత్రమే ఆహ్వానం కల్పించింది ఎయిర్ బీఎన్‌బీ. అంతే కాకుండా వారికి కేవలం ఒక బెడ్ రూమ్, ఒక బాత్ రూమ్‌లోకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మే 12 నుంచి ఈ ఇంట్లో ఉండడానికి బుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయని ఎయిర్ బీఎన్‌బీ ప్రకటించింది. అంతే కాకుండా బుకింగ్ చేసుకున్న వారిలో ఎవరు వచ్చి తన ఇంట్లో, తనతో పాటు ఉండగలరు అనే నిర్ణయాన్ని పూర్తిగా జాన్వీ కపూర్ చేతిలో పెట్టింది ఎయిర్ బీఎన్‌బీ. తను సెలక్ట్ చేసిన గెస్టులకు సౌత్ ఇండియన్ స్టైల్‌లో లంచ్ ఉంటుందని, అందులో జాన్వీ ఫేవరెట్ అయిన నెయ్యి పొడి రైస్, పాలకోవా కూడా ఉంటాయని తెలిపింది.
షేర్ చేసుకుంటాను..
ఎయిర్ బీఎన్‌బీలో జాన్వీ కపూర్ ఇంటిని బుక్ చేసుకున్న వారు.. ఒక రాత్రి అక్కడే గడపొచ్చు. ఆ సమయంలో జాన్వీతో ముచ్చటించవచ్చు కూడా అని ఎయిర్ బీఎన్‌బీ క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటి గురించి తనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ‘‘చెన్నైలో నా చిన్నప్పుడు సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడం నాకు చాలా గుర్తుండిపోతుంది. ఈ ఇంటితో ఎలాంటి అనుబంధం ఉందో నా ఫ్యాన్స్‌తో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కపూర్ ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో కొందరు ఫ్యాన్స్‌కు చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు సౌత్ ఇండియన్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు, మా అమ్మ నేచురల్ స్కిన్ కేర్‌ను ట్రై చేయవచ్చు’’ అని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది జాన్వీ కపూర్.
Also Read: అది తెలుసుకోవడం చాలా ముఖ్యం - తిరుపతిపై జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు