Jagapathi Babu : 'గుంటూరు కారం'లో నా క్యారెక్టర్ మరోలా ఉండాల్సింది - అందుకే సినిమాని ఎంజాయ్ చేయలేకపోయా: జగపతిబాబు
Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో 'గుంటూరు కారం' సినిమాలో నటించడాన్ని తాను ఎంజాయ్ చేయలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Senior Actor Jagapathi Babu Shocking Comments On Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ పై చాలానే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతిబాబు విలన్ రోల్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన 'గుంటూరు కారం' సినిమాలో నటించడాన్ని తాను ఎంజాయ్ చేయలేకపోయానని, అందుకు గల కారణాన్ని కూడా వెల్లడిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
'గుంటూరు కారం'లో నా క్యారెక్టర్ మరోలా ఉండాల్సింది
సీనియర్ నటుడు జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.." సినిమాలో నా క్యారెక్టర్ గా ఉండాల్సింది. కానీ ఆ తర్వాత మొత్తం మారిపోయింది. మహేష్ బాబుతో కలిసి నటించడానికి నేనెప్పుడూ ఇష్టపడతాను. కానీ నిజం చెప్పాలంటే గుంటూరు కారం సినిమాని నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే అందులో నా క్యారెక్టర్ రేషన్ చాలా డిఫరెంట్ గా ఉండాల్సింది. క్యారెక్టర్స్ ని ఇంకా మెరుగ్గా రాసుకోవాల్సింది. కానీ కొంతకాలం తర్వాత మొత్తం గందరగోళం అయిపోయింది. దీంతో సినిమా పూర్తి చేయడం కష్టమైంది" అని అన్నారు.
మహేష్‌తో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలనుకుంటా
"నేను చేయాల్సింది చేశాను. కానీ మహేష్ బాబుతో నా కాంబినేషన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలని అనుకుంటా. ఇలాంటి సినిమాల కోసం మా కాంబినేషన్ వేస్ట్ చేయాలని అనిపించదు" అని చెప్పుకొచ్చాడు. జగపతిబాబు మాటలని బట్టి చూస్తే 'గుంటూరు కారం'లో తన క్యారెక్టర్ మధ్యలో మార్చేశారని, దానివల్ల తాను ఎంజాయ్ చేయలేకపోయానని స్వయంగా ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. 'గుంటూరు కారం' సినిమాకు ముందు రాసుకున్న స్క్రిప్ట్ ని దర్శకుడు త్రివిక్రమ్ పూర్తిగా మార్చేశారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగపతిబాబు కామెంట్స్ ని బట్టి అది నిజమే అని మరోసారి రుజువైంది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ రోల్స్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. నిజం చెప్పాలంటే హీరోగా కంటే ఇప్పుడు విలన్ గానే జగపతిబాబుకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2'లో కీలక పాత్ర చేస్తున్న జగపతిబాబు.. రవితేజ హీరోగానటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే సూర్య 'కంగువ' మూవీ తో పాటు 'రుస్లాన్' అనే హిందీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు అందుకుంటున్నాడు ఈ సీనియర్ హీరో.
Also Read : పెళ్లయ్యాక కూడా అది చెయ్యాలి, అప్పుడే లైఫ్ హ్యాపీ: విజయ్ ఆంటోని