అన్వేషించండి

Jacqueline Fernandes: ముద్దుగుమ్మల పోట్లాట - అనవసర విషయాల్లోకి ఆమెను లాగోద్దు, నోరా ఫతేహీపై జాక్వెలిన్ లాయర్ ఫైర్ - వీరి గొడవేంటీ?

మనీలాండరింగ్ కేసులో తనను బలిపశువును చేశారని నోరా ఫతేహి ప్రకటించడం పట్ల జాక్వెలిన్ న్యాయవాది స్పందించారు. అనవసర విషయాల్లోకి జాక్వెలిన్ ను లాగకూడదని ఆమెను హెచ్చరించారు.

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మనీ లాండరింగ్ తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే  రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బుక్కై నానా తిప్పులు పడుతుండగా, కొద్ది రోజుల క్రితం మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ పై పరువు నష్టం కేసు పెట్టింది. తాజాగా ఈ కేసులో నోరా ఫతేహి స్టేట్‌మెంట్‌ ను న్యాయస్థానం రికార్డు చేసింది. “కొంత మంది నన్ను కావాలని టార్గెట్ చేశారు. మనీలాండరింగ్ సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్‌తో నాకు సంబంధం ఉందని ఆరోపించారు. కొందరిని రక్షించడానికి మీడియాలో నన్ను బలిపశువుగా ఉపయోగించారు. ఈ కేసు కారణంగా నాకు జరిగిన అన్ని రకాల నష్టాలకు పరిహారం కావాలని కోరుతున్నాను. ఈ కేసులో నన్ను ఈడీ సాక్షిగా, తనను నిందితురాలిగా ఎందుకు తీసుకుందని జాక్వెలిన్ మీడియాను ప్రశ్నించింది. ఈ ప్రకటనతో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. చాలా అవకాశాలను కోల్పోయాను. సైబర్ బెదిరింపులకు గురయ్యాను” అని న్యాయస్థానం ముందు నోరా ఆవేదన వ్యక్తం చేసింది.   

అనసవరమైన విషయాల్లోకి జాక్వెలిన్ ను లాగకండి-  ప్రశాంత్ పాటిల్

నోరా ఫతేహి స్టేట్మెంట్ ను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న్యాయవాది  ప్రశాంత్ పాటిల్ తప్పుబట్టారు. తన క్లయింట్‌ను అనవసరమైన వివాదంలోకి లాగుతోందని ఆరోపించారు. నోరా ఫతేహికి వ్యతిరేకంగా జాక్వెలిన్ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పారు.  “ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ముందు జాక్వెలిన్.. నోరా ఫతేహిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఈ కేసు గురించి బయట ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మౌనంగానే ఉంది. కానీ, కొందరు ఆమెను అనవసరమైన విషయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు” అని వెల్లడించారు.

నోరా పరువు నష్టం కేసు ఎందుకు పెట్టిందంటే?

సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి గతంలో ఈడీ విచారణ కొనసాగింది. ఇందులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్ ను కూడా విచారించారు. ఎంక్వయిరీలో భాగంగా సుఖేష్ కు తనతో పాటు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అందులో నోరా ఫతేహి చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని చెప్పింది. ఈడీ విచారణలో తన పేరును ప్రస్తావించడం పట్ల  జాక్వెలిన్ పై నోరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడింది. జాక్వెలిన్ తో పాటు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన పలు వార్తా చానెళ్లపై పరువు నష్టం కేసు వేసింది. కొంతమంది తనను కావాలని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. తనకు సుఖేష్ తో ఎలాంటి స్నేహం లేదని  తేల్చి చెప్పింది.    

తప్పు చేయకపోతే అఫిడవిట్ దాఖలు చేయండి- విక్రమ్ సింగ్ చౌహాన్

అటు పరువు నష్టం కేసు విషయంలో నోరా ఫతేహి లాయర్ విక్రమ్ సింగ్ చౌహాన్ సైతం రియాక్ట్ అయ్యారు. జాక్వెలిన్  ఏ తప్పు చేయకపోతే, వెంటనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు.  

Read Also: కోర్టు తీర్పు రిలీఫ్ ఇచ్చింది - నా కుటుంబం బాధపడుతోంది: నటుడు నరేష్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget