అన్వేషించండి

Jackie Shroff: రజినీకాంత్ చేసిన పనికి కన్నీళ్లు వచ్చాయి: ‘జైలర్’ అనుభవాన్ని గుర్తుచేసుకున్న జాకీ ష్రాఫ్

తాజాగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ‘జైలర్’ షూటింగ్ సమయంలో రజినీ చేసిన పని తనకు కన్నీళ్లు తెప్పించింది అంటూ చెప్పుకొచ్చాడు.

కేవలం తమిళనాడులో మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో, రాష్ట్రాల్లో రజినీకాంత్‌ను దైవంగా భావిస్తారు. అంతే కాకుండా ఆయన సినిమాల రిలీజ్‌ను ఒక పండగా లాగా సెలబ్రేట్ చేస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో రజినీ ఎన్నో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. దానికి కేవలం ఆయన సినిమాలు, స్టైల్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ యాటిట్యూట్ కూడా ముఖ్యమే. రజినీతో కలిసి పనిచేసిన కో యాక్టర్లు కానీ, ఆయనను కలిసిన అభిమానులు కానీ.. ఆయన మంచితనం గురించి, సింప్లిసిటీ గురించి మాట్లాడకుండా ఉండలేరు. తాజాగా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ‘జైలర్’ షూటింగ్ సమయంలో రజినీ చేసిన పని తనకు కన్నీళ్లు తెప్పించింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఈరోజుల్లో బాలీవుడ్ సీనియర్ నటీనటులు సైతం సౌత్ ఇండస్ట్రీలలో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే హిందీలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన జాకీ ష్రాఫ్ కూడా రజినీ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’లో విలన్‌గా కనిపించారు. కేవలం జాకీ ష్రాఫ్ మాత్రమే కాదు.. మరెందరో సీనియర్, హైప్ ఉన్న నటీనటులు ‘జైలర్’లో భాగమయ్యారు. ఇందులో రజినీకి జోడీగా తమన్నా నటిస్తుండగా ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్’ విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ‘జైలర్’లో విలన్ రోల్ చేసిన జాకీ ష్రాఫ్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ మూవీకి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అలా తాజాగా ఒకరోజు ‘జైలర్’ సెట్‌లో తనకు జరిగిన ఎమోషనల్ మూమెంట్‌ను బయటపెట్టారు.

కన్నీళ్లు ఆగలేదు..
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్‌తో కలిసి ‘జైలర్’లో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు జాకీ ష్రాఫ్. ఒకరోజు షూట్ అయిపోయిన తర్వాత రజినీ కంగారుగా సెట్ నుంచి బయటికి వెళ్లిపోయారని, ఆ సమయంలో తనకు బాయ్ చెప్పలేదని అన్నారు. కానీ బాయ్ చెప్పలేదన్న విషయం గుర్తొచ్చి ప్రత్యేకంగా మళ్లీ వెనక్కి వచ్చి తనకు బాయ్ చెప్పి వెళ్లారని, అంతే కాకుండా మర్చిపోయి వెళ్లినందుకు సారీ కూడా చెప్పారని తెలిపారు. రజినీ అలా చేయడం తన కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేసిందని జాకీ ష్రాఫ్ అన్నారు. అది తనకు ఒక ఎమోషన్ మూమెంట్ అని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపించే అభిమానాన్ని, ప్రేమను అందరూ ఎంజాయ్ చేసేవారని చెప్పారు. ప్రతీ ఒక్కరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునేవారని అన్నారు.

ఏం చేసినా స్టైలే..
రజినీకాంత్ గురించి మరెన్నో విషయాలు చెప్పుకొచ్చారు జాకీ ష్రాఫ్. ‘అన్నీ మారినా కూడా తలైవా మాత్రం అలాగే ఉన్నారు. ఆయన అందరిపై చూపించే ఆదరణ అనేది ఎన్నో ఏళ్లుగా అలాగే ఉంది. నేను కలిసి పనిచేసిన సూపర్‌స్టార్లలో ఆయనంతా హుందాగా ఉండే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఆయనకొక స్టార్‌డమ్ ఉంది. ఎవరైనా ఆయనతో కలిసి పనిచేస్తే ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. రజినీ గారు స్క్రీన్‌పై వేరొక వ్యక్తిలాగా కనిపిస్తారు. ఒక సినిమాలో కనిపించడం కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతారు. ఒక్కసారి ఆ పాత్ర నుంచి బయటికి వస్తే ఆయన మళ్లీ ఒక మామూలు మనిషే. ఆయన స్టైల్, మాట్లాడే విధానం, నడిచే విధానం, లుక్స్, గ్లాసెస్‌తో ఆయన చూపించే గ్రేస్.. ఇలా ఆయన ఏం చేసినా బ్రిలియెంట్‌గానే ఉంటుంది.’ అని జాకీ ష్రాఫ్ ‘జైలర్’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. ఇక జాకీ ష్రాఫ్, రజినీకాంత్ కలిసి 2014లో విడుదలయిన ‘కొచ్చడయాన్’తో పాటు 1987లో వచ్చిన ‘ఉత్తర్ దక్షిన్’ చిత్రంలో కూడా నటించారు.

Also Read: 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Embed widget