News
News
వీడియోలు ఆటలు
X

ఇంటిమేట్ సీన్స్ తో సమంత షాక్ ఇవ్వబోతోందా..?

సమంత రూత్ ప్రభు ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం నటిస్తున్న సిరీస్ కోసం ఇంటిమేట్ సీన్స్ చేయడానికి రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 వెబ్ సిరీస్ తో డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇచ్చిన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. డెబ్యూతోనే ఓటీటీలో అదరగొట్టింది. ఈ క్రమంలో రాజ్‌ & డీకే దర్శకత్వంలోనే మరో సిరీస్ లో నటిస్తోంది సామ్. "సిటాడెల్" అనే పేరుతో రాబోతున్న ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఇందులో ప్రధాన జంట మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉంటాయనే న్యూస్ ఇప్పుడు సోషల్ ,మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

రూస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్‌’ కు ఇండియన్ వెర్షన్‌ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన అమెరికన్ వెర్షన్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రియాంక చోప్రా జోనస్, రిచర్డ్ మాడెన్ మధ్య కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. దీంతో ఇండియన్ వెర్షన్‌ లో సమంత - వరుణ్ ధావన్ ల మధ్య అలాంటి సన్నివేశాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. 

తాజా నివేదికల ప్రకారం, అమెరికన్ వెర్షన్ మాదిరిగానే, 'సిటాడెల్' ఇండియన్ సిరీస్‌ లో కూడా సామ్ - వరుణ్ మధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. కథలో కీలకం కావడంతో, స్టార్ హీరోయిన్ ఆ సన్నివేశాల్లో నటించడానికి అంగీకరించిందట. అధికారికంగా ధృవీకరించబడలేదు కానీ, మేకర్స్ ఇప్పటికే ఇంటిమేట్ సీన్స్ ని షూట్ చేసారని టాక్ వినిపిస్తోంది. సమంత ఇంతకముందు 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ లోనూ కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు వరుణ్ తో కలిసి ఇంటిమేట్ సన్నివేశాలల్లో నటించిందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. 

ఇకపోతే 'సిటాడెల్' అనేది రూసో బ్రదర్స్ అమెరికన్ సిరీస్‌ కి రీమేక్ కాదని సమంత క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సిరీస్ ప్రైమ్ లో అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేయబడింది. ఆల్రెడీ ఆడియన్స్ చూసేసిన కథను ఇప్పుడు మళ్ళీ చూస్తారా? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఓ నెటిజన్ సోషల్ మీడియాలో సమంత వద్ద ప్రస్తావించాడు. రెండు కథలు ఒకటేనా? లేదా భిన్నంగా ఉంటుందా? అనేది స్పష్టం చేయమని ప్రశ్నించగా.. ఇది రీమేక్ కాదని సామ్ బదులిచ్చింది. దీన్ని బట్టి ఇండియన్ వెర్షన్ ను దర్శక ద్వయం మన సెన్సిబిలిటీస్ కి తగ్గట్టుగా మార్పులు చేశారనే విషయం తెలుస్తోంది. 

Also Read : గోపీచంద్‌తో 'రెడ్' బ్యూటీ - ఇద్దరికీ ఫ్లాపులే, హిట్ వస్తుందా?

'సిటాడెల్' లో వరుణ్ ధావన్ - సమంత గూఢచారులుగా కనిపించనున్నారు. ఇందులో సామ్ యాక్షన్ స్టంట్స్ చేయబోతోంది. దీని కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న అగ్ర నటి, కాస్త కోలుకున్న తర్వాత చిత్రీకరణలో పాల్గొంది. షూటింగ్ టైంలో ఆమెకు గాయాలు కూడా అయినట్లు సోషల్ మీడియాలో తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. యూకే ప్రీమియర్ కోసం వరుణ్ - సమంత ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

స‌మంత ఇత‌ర సినిమాల విష‌యానికి వ‌స్తే.. గత నెలలో వచ్చిన 'శాకుంత‌లం' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా నటిస్తున్న 'ఖుషి' అనే రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇదే క్రమంలో 'చెన్నై స్టోరీ' అనే ఇంగ్లీష్ రోమ్ కామ్ లో సామ్ కనిపించనుంది. 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఫేమస్ నవల ఆధారంగా, హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. 

Also Read ఐపీఎస్ అధికారితో గొడవ - 'ఖిలాడీ' హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు

Published at : 23 May 2023 09:44 AM (IST) Tags: Sam Samantha Ruth Prabhu samantha web series Varun Dhawan Samantha Citadel Raj & DK

సంబంధిత కథనాలు

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Flautist Naveen Kumar: ఏఆర్ రెహ్మాన్ ఫ్లూటిస్ట్ నవీన్ కుమార్‌కి బైడెన్ ప్రశంసలు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌తో సత్కారం

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు- ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi : కష్టం కలిగినా అబ్బాయికి విడాకుల గురించి చెప్పక తప్పలేదు-  ఆశిష్ విద్యార్థి

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం