Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
Hero Nani: న్యాచులర్ స్టార్ నాని గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడట.
Hero Nani Turns as Writer: న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో తన నెక్ట్స్ సినిమాలను కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న నాని.. రైటర్‌గా మారాడట. ఇందుకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకి అసలు సంగతేంటంటే.. తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్‌లో హిట్ 1, హిట్ 2ను తెరకెక్కించని నాని.. ఇప్పుడు హిట్ 3కి రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో నాని కూడా నటించబోతున్నాడు. పోలీసు ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నట్టు 'హిట్ 2' ఎండింగ్‌లో వెల్లడించారు. త్వరలోనే హిట్ 3 సెట్‌పైకి రానుందని సమాచారం. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు నాని కథ-స్క్రీన్‌ప్లే అందించనున్నాడని టాక్. ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనుభవం ఉన్న నాని.. హిట్ 3తో రైటర్‌గా మారనున్నాడంటూ ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం నాని 'సరిపోదా శనివారం' సినిమాతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై హైప్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమా ప్రతికథానాయకుడిగా నటిస్తున్న ఎస్‌జే సూర్య స్పెషల్ వీడియో రిలీజ్ చేసి మూవీపై మరింత బజ్ పెంచారు. ఇందులో నాని-ప్రియాంక మోహన్‌ను శ్రీకృష్ణుడు-సత్యభామతో పోలుస్తూ.. ఎస్‌జే సూర్యను రాక్షసుడితో పోల్చుతూ వీడియో సాగింది. ఇందులో ఎస్‌జే సూర్య క్రూరమైన పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో మూవీపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రం తర్వాత నాని 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో డెవలప్ చేసే బిజీలో ఉన్నాడు. ఈ లోగా నాని సరిపోదా శనివారం పూర్తి చేసుకుని హిట్ 3 సినిమాను సెట్‌పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
కాగా ఓ సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాని ఆ తర్వాత అంచెలంచెలు ఎదిగాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన నాని అనుకొకుండ హీరో అయ్యాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. నటనలో సహజత్వం చూపిస్తూ పక్కింటి కుర్రాడిలా గుర్తింపు పొందాడు. అలా వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాని ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగానూ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పుడు రైటర్‌గా మారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం.