News
News
వీడియోలు ఆటలు
X

Virupaksha Modhamamba Temple: ‘విరూపాక్ష’ మూవీ కోసం ఏకంగా గుడే కట్టేశారు - ఎంత అద్భుతంగా ఉందో చూడండి

‘విరూపాక్ష’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో భాగంగా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే మోధమాంబ టెంపుల్ సెట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

FOLLOW US: 
Share:

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటిస్తోన్న సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీను ఎస్వీసీసీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో మొట్టమొదటి సారి పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఓ మిస్టీరియస్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను భారీగానే చేసుకుంటూ వస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్ లను కూడా అలాగే రివీల్ చేస్తున్నారు. గతంలో ఈ మూవీ గ్లింప్స్ ను ఎన్టీఆర్ తో అలాగే పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ ను చేయించారు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఇప్పుడు ప్రమోషన్స్ లో తానే రంగంలోకి దిగారు. ‘విరూపాక్ష’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో భాగంగా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలచే మోధమాంబ టెంపుల్ సెట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.  

ఈ వీడియోలో మోధమాంబ టెంపుల్ ప్రత్యేకతను వివరించారు. ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే ఊరుకు ఓ కథ ఉందట. ఆ ఊరిలో మోదమాంబ అనే అమ్మవారి గుడి ఉంటుందట. సినిమాలోని పాత్రలు అన్నీ ఈ టెంపుల్ చుట్టూనే తిరుగుతాయట. అందుకోసం ప్రత్యేకంగా ఒక పెద్ద సెట్ వేశారట మేకర్స్. టెంపుల్ సహజంగా కనిపించడానికి సరికొత్త టెక్నాలజీ, శిల్పులను కూడా తీసుకొచ్చారట. కథకు తగ్గట్టుగా సెట్ వేశారట. సినిమా కోసం సాంకేతిక నిపుణులు ఎంతగా కష్టపడ్డారు అనేది వీడియోను చూస్తే అర్థమవుతుంది. వీడియో మొదట్లో కనిపించే బుక్ పై వాల్యూమ్ 1 అని రాసి ఉంది. అంటే ఈ సినిమా రెండు భాగాల్లో విడుదల అవుతుందని తెలుస్తోంది. 

ఈ టెంపుల్ గురించి టీజర్ లో కూడా లైట్ గా చూపించారు. అయితే సినిమా మొత్తం దీని పైనే ఆధారపడి ఉందని తాజా వీడియోతో అర్థమవుతుంది. ఈ సినిమాలో ఆలయ ప్రాముఖ్యత ఏంటి, ఎలా చూపిస్తారు అనేది చూడాలి. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.

సాయి ధరమ్ తేజ్ కు ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. యాక్సిడెంట్ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘విరూపాక్ష’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ లో బిజీ అవుతోంది. ఈ మూవీ ప్రచార చిత్రాలు చూస్తుంటే మూవీ రెండు భాగాలుగా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘వినోదయా సీతం’ సినిమాకు ఈ మూవీ రిమేక్. నటుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

Published at : 21 Mar 2023 08:40 AM (IST) Tags: Sai Dharam Tej sai dharam tej movies Virupaksha Modhamamba Temple

సంబంధిత కథనాలు

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!