Chengaluva Song: భారతీయుడిలో సిద్దార్థ్, రకుల్ రొమాంటిక్ సాంగ్... మెలోడీతో వచ్చిన అనిరుధ్
Indian 2 Second Single: కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ టీమ్. రెండో పాటను రిలీజ్ చేసింది. ఈసారి మెలోడీని అందించింది.
Indian 2 Second Lyrical Video Released: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా 'భారతీయుడు 2'. స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది సినిమా టీమ్. దాంట్లో భాగంగా ఒక్కొక్కటిగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పాటను రిలీజ్ చేసిన టీమ్... ఇప్పుడు సెకండ్ లిరికల్ వీడియోను బుధవారం రిలీజ్ చేసింది. 'చెంగలువ చేయ్యందేనా... చెలికాన్ని చేరేనా' అంటూ ఈ లిరికల్ సాంగ్ తాజాగా విడుదల చేశారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మీద తీసిన ఈ పాట మెలోడియస్ గా, కూల్ మ్యూజిక్ తో సాగింది.
కూల్ మ్యూజిక్ తో..
'భారతీయుడు - 2' (ఇండియన్ 2) సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు రిలీజైన ఈ మెలోడి కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఒక మంచి బ్యాగ్రౌండ్ ఉన్న కేఫ్ లో రకుల్, సిదార్థ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాలో వాళ్లిద్దరు ప్రేమికులు అని ఈ పాట ద్వారా తెలుస్తుంది. అలిగిన ప్రేయసిని ప్రియుడు బుజ్జగిస్తున్నట్లుగా కూడా ఉంది ఈ పాట. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.
చెంగలువ చేయ్యందేనా, చెలికాన్ని చేరేనా..
'చెంగలువ చేయ్యందేనా, చెలికాన్ని చేరేనా
నిజమేనా.. నిశాంతమేనా..
సంద్రాలు రుచి మార్చేనా?.. మధురాలు పంచేనా?
ఇది వేరే ప్రపంచమేనా?
సమీప దూరాల నిర్ణయం, గతాల గాయం ఇవేళ నీ రాకతో జయం నిరంతరాయం.
వరించు ఉత్సాహమేదో పుంజుకున్న నీ పెదాలకు.
తరించు ఉల్లాస లాలి పాడే నీకు మోము దాచకు.
మారే మనసులలో ఏమి ఇంద్రజాలం. తీరే తపనలకు దేహం చంద్రయానం. ఆరంభం ఈ పయనం.'
అంటూ సాగింది ఈ పాట.' ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, పాట సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు మ్యూజిక్ లవర్స్.
భారతీయుడికి సీక్వెల్..
1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రిలీజైన భారతీయుడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 50 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు - 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ చందమామా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇక జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చెన్నై ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సమక్షంలో భారతీయుడు 2 ఆడియో లాంచ్ జరగనుంది.
Also Read: అసెంబ్లీలోకి నట సింహం, కొదమ సింహం... నందమూరి, కొణిదెల ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా హైపర్ ఆది స్పీచ్