సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామనుకున్న : విరాజ్ అశ్విన్
'బేబీ'లో కీలక పాత్ర పోషించిన వారిలో విరాజ్ అశ్విన్ ఒకరు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 'బేబీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో తాను ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నానని చెప్పాడు.
Viraj Ashwin: యంగ్ నటులు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకోవడంతో నటీనటులందరికీ మంచి గుర్తింపు కూడా వచ్చింది. అందులో విరాజ్ అశ్విన్ కూడా ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలనుకున్నానని విరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలా తనకు చాలా సార్లు అనిపించిందని కూడా ఆయన తన భావాలను పంచుకున్నారు.
సినిమాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి తనకు చాలా సపోర్ట్ చేశారని విరాజ్ చెప్పారు. తన తండ్రి వందశాతం ఇవ్వగలనని అనిపిస్తే నువ్వు చేయాలనుకుంటున్నది చెయ్యమని చెప్పారని వివరించారు. తండ్రి సపోర్ట్ చేస్తానని అన్నారని వివరించారు. అయితే టైమ్ పాస్‌లా మాత్రం చేయొద్దని ముందే చెప్పారని అన్నారు. కష్టపడమని... రిజల్ట్ గురించి మాత్రం అనేవారు. తండ్రి సపోర్ట్ లేకుండా తాను ఏదీ సాధించలేనని విరాజ్ చెప్పుకొచ్చాడు.
"ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని చాలా సార్లు అనుకున్నా. చిన్న భయం కూడా వేసింది. కానీ ఎక్కడో మొండి నమ్మకం, ధైర్యం ఉండి అలా ఉండిపోయా. మనం ఒక సినిమాకు కమిట్ అవుతాం. అది హిట్ అవుతుందని అనుకుంటాం. మనం విన్నది ఒకటి వాళ్లు ప్రజెంట్ చేసేది ఒకటైతే చాలా హర్టింగ్ గా ఉంటుంది.. అది కూడా టెక్నికల్ గా. అలాగే కొన్ని ఎలా ఉంటాయంటే.. ఈ సినిమా మనం చేయబోతున్నామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి.. దీంతో కెరీర్ స్టార్ట్ అవుతుందని అనుకున్నపుడు అది జరగదు. అందులో కొన్ని సార్లు ఎవరి తప్పూ ఉండదు. కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా అవుతుంది. ఆ సమయంలో అసలు మనం యాక్టర్ అవుతామా, అవకాశాలు వస్తాయా, చేయగల్గుతామా.. అనిపిస్తుంది. అలా చాలా జరిగాయి కూడా" అని విరాజ్ చెప్పుకొచ్చాడు.
ఇక 'బేబీ' సినిమా భారీ హిట్ కావడంతో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్యకు ఇప్పుడు అవకాశాలు కూడా భారీగానే వస్తున్నట్టు టాక్ నడుస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. ఊహించని రేంజ్ లో వచ్చిన రెస్పాన్స్ తో ఆమెను పలువురు సినీ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇక బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తీయబోయే రెండు సినిమాల్లోనూ వైష్ణవే హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరో రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్ గా తీసుకున్నారని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Read Also : Akshay Kumar: అక్షయ్ కుమార్ ఎట్టకేలకు ఇండియన్ అయ్యాడు - ‘రిపబ్లిక్ డే’ రోజు భారత పౌరసత్వం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial