అన్వేషించండి

Sundeep Kishan : 'మైఖేల్' సినిమా నాకే నచ్చలేదు - రిలీజ్‌కు ముందే రిజల్ట్ తెలుసు : సందీప్ కిషన్

Sandeep Kishan : ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో 'మైఖేల్' మూవీ రిజల్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ ఈ ఫిబ్రవరి 16కి 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. గతంలో ఈ కాంబోలో 'టైగర్‌' మూవీ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్‌, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన అందుకున్నాయి.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే హీరో సందీప్ కిషన్ వరుస ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ మైఖేల్ సినిమా రిజల్ట్ పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'మైఖేల్' సినిమా నాకే నచ్చలేదు

మైఖేల్ రిజల్ట్ గురించి సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." అవును నిజమే.. 'మైఖేల్' సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది. కానీ ఎక్కడో దాని గురించి మిస్టేక్ జరిగింది. మైకేల్ మూవీ ని ముగ్గురు నిర్మాతలు నిర్మించారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఇద్దరు నిర్మాతలు అన్నారు. కానీ ఓ నిర్మాత రిలీజ్ కి సరిగ్గా 12 రోజుల ముందు సినిమా సరిగ్గా రాలేదని అన్నారు. అప్పుడు విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో నేను మళ్ళీ అవుట్ ఫుట్‌ను రీ చెక్ చేయలేదు. ఎందుకంటే సరిగ్గా రిలీజ్ టైంలో అలాంటి ఒత్తిడిని నేను ఎదుర్కోవాలనుకోలేదు. రిలీజ్ కు ఒక్క రోజు ముందు సినిమా చూసినప్పుడు సినిమా బాలేదని నాకు అర్థమైంది" అని అన్నారు.

టెక్నికల్ పరంగా 'మైఖేల్' ఫెంటాస్టిక్ ఫిల్మ్

"మైఖేల్ కి సంబంధించి మొదట్లో కొన్ని ఎపిసోడ్స్ చూసి కచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని భావించాను. అయితే సినిమా మొత్తం చూసినప్పుడు ఈ ఎపిసోడ్స్ మాత్రమే కాదు కథ మొత్తం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూడాలి. టెక్నికల్ పరంగా మైఖేల్ ఒక ఎక్స్ ట్రార్డినరీ ఫిలిం. మేం కూడా సినిమాపై సాలిడ్ టెక్నికల్ ఎఫెక్ట్స్ పెట్టాం. అదే సమయంలో కథ పై కాన్సెంట్రేట్ చేయలేదు. మేము అనుకున్న కథ ఆడియన్స్ కి చెప్పలేకపోయాం. మైఖేల్ మూవీ విషయంలో నాకు కష్టంగా అనిపించింది. ఎందుకంటే రిజల్ట్ నాకు ముందే తెలుసు కాబట్టి" అంటూ  చెప్పుకొచ్చారు. మిస్టీరియస్ థ్రిల్లర్ గా రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్షా బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు. హాస్య మూవీస్ ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అనిల్ సుంకర రాజేష్ దండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Also Read : సాంగ్‌లా లేదు, షాంపూ యాడ్‌లా ఉంది - ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ సాంగ్‌పై ట్రోల్స్

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget