Taapsee Pannu: నేనేమీ ప్రెగ్నెంట్ కాదు, పెళ్లి చేసుకోడానికి - ఆ హీరోయిన్ పెళ్లిపై తాప్సీ సెటైర్?
నటి తాప్సీ పన్ను పలువురు బాలీవుడ్ తారలకు పరోక్షంగా పంచులు విసిరింది. పెళ్లి ఎప్పుడు అని అడిగిన ఓ నెటిజన్ ప్రశ్నకు తానింకా ప్రెంగ్నెంట్ కాదని, పెళ్లికి తొందర ఏమీ లేదంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పింది.
అందాల తార తాప్సీ పన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కొంతకాలం పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెమ్మదిగా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. సౌత్ సినిమా పరిశ్రమతో పాటు సౌత్ దర్శకులపైనా పలు వ్యాఖ్యలు చేసి సంచలనం కలిగించింది. తాజాగా పలువురు బాలీవుడ్ నటీమణులపై అదిరిపోయే పంచులు వేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారాయి.
నేను ప్రెగ్నెంట్ కాదు, పెళ్లికేం తొందర లేదు!
తాజాగా తాప్సీ నెటిజన్లతో ముచ్చటించింది. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ప్రేమ, పెళ్లి, సినిమాలు, టూర్లు సహా పలు అంశాల గురించి వివరించింది. అన్ని ప్రశ్నలు కామన్ అయినా, “మీ పెళ్లి ఎప్పుడు?” అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్న హైలెట్ అయ్యింది. అతడి ప్రశ్నకు తాప్సీ అదిరిపోయే సమాధానం చెప్పింది. “నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు. కాబట్టి, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక వేళ చేసుకుంటే తప్పకుండా చెప్తాను” అని ఆన్సర్ చెప్పింది.
బీటౌన్ లో దుమారం రేపుతున్న తాప్సీ వ్యాఖ్యలు
తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను తాప్సీ ఆలియా భట్‌ను టార్గెట్ చేసిందనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి వీరిద్దరు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు తాప్సీ సమాధానం విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరీ ఇంత బోల్డ్ గా మాట్లాడుతుందేంటి? అని చర్చించుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం పలు దేశాల్లో పర్యటిస్తోంది. అమెరికా, డెన్మార్క్ తో పాటు పలు దేశాలను చుట్టేసి వచ్చింది. తన తర్వాత పర్యటన ఎక్కడ అనేది ఇంకా ఫిక్స్ కాలేదని చెప్పింది. సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటుందో వివరించే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్తలో వ్యక్తులతో మాట్లాడటానికి, వారి అభిప్రాయాలను పంచుకోవడానికి మంచి వేదికగా భావించినట్లు చెప్పింది. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎదుటివారిపై బుదరజల్లే మాధ్యమంగా మారిపోయిందని వ్యాఖ్యానించింది.
‘డుంకీ’, ‘ఏలియన్’ సినిమాలు చేస్తున్న తాప్సీ
తాప్సీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇప్పటికే కొద్ది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కావాలంటే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీని అడగాలని సూచించింది. అటు తమిళంలో ‘ఏలియన్’ సినిమా చేస్తున్నట్లు చెప్పింది. ఇదొక హై-కాన్సెప్ట్ మూవీ అని చెప్పింది. ‘గేమ్ ఓవర్’ను ఎంజాయ్ చేసిన వాళ్లు ఈ సినిమాకు కూడా ఇష్టపడతారని చెప్పింది. తనకొక సరికొత్త అనుభూతిని ఈ సినిమా కలిగించిందని తాప్సీ వెల్లడించింది.
Read Also: అందుకే ‘జవాన్’లో నటిస్తున్నా, డబ్బులు ఇవ్వకపోయినా చేసేవాడిని: విజయ్ సేతుపతి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial