Hombale Films Upcoming Movie: సుధా కొంగర దర్శకత్వంలో 'కెజియఫ్ 2' నిర్మాత కొత్త సినిమా
సుధా కొంగర దర్శకత్వంలో 'కెజియఫ్ 2' నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ సినిమా నిర్మించనున్నారు. ఈ రోజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
KGF Chapter 2 production house Hombale Films New Movie: 'కెజియఫ్' ఫస్ట్ చాఫ్టర్, 'కెజియఫ్ 2' సినిమాకు ముందు హోంబలే ఫిలింస్ గురించి కన్నడ ప్రేక్షకులకు తప్ప, ఇతర భాషల ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇప్పుడు? హోంబలే ఫిలింస్ అంటే బ్రాండ్. ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు ఆ సంస్థ కొత్త సినిమా అనౌన్స్ చేసింది.
'గురు', 'ఆకాశమే నీ హద్దురా' చిత్రాలతో విజయాలు అందుకోవడమే కాదు... తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో గౌరవం సొంతం చేసుకున్న దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara). ఆమె దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) సినిమా నిర్మిస్తున్నారు. నేడు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
"కొన్ని కథలను తప్పకుండా చెప్పాలి. చెప్పడానికి అర్హమైనవి. వాటిని సరిగ్గా చెప్పాలి. సుధా కొంగర దర్శకత్వంలో మా హోంబలే ఫిలింస్ తదుపరి చిత్రాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం" అని నిర్మాత విజయ్ కిరగందూర్ ట్వీట్ చేశారు.
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల విడుదలైన 'కెజియఫ్ 2' విజయంతో హోంబలే ఫిలింస్ సంతోషంగా ఉంది. సుధా కొంగరతో సినిమా కాకుండా... ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.