అన్వేషించండి

Sailesh Kolanu: ఒక్క విషయంలో తప్పటడుగు వేస్తున్న శైలేష్ కొలను... అందరి నోటా వినిపించే కామన్ విమర్శ

Hit 3 Director Sailesh Kolanu: 'హిట్ 3' విజయం సాధించినప్పటికీ... దర్శకుడు శైలేష్ కొలను మీద కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో ప్రధానంగా విమర్శ వినబడుతోంది. అది ఏమిటంటే?

నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3'పై టాక్ రకరకాలుగా వినిపించినా కలెక్షన్స్ (వసూళ్ల)లో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'హిట్' సిరీస్‌లో వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. చాలా కాలం తర్వాత సింగిల్ స్క్రీన్స్  లో మళ్లీ మాస్ జనాల సందడి కనిపించిందని 'దిల్' రాజు లాంటి  నిర్మాతలు చెప్పారు కూడా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, శైలేష్ కోలను సినిమాల్లో అందులోనూ 'హిట్' సిరీస్‌లో ఒక ప్రధానమైన సమస్య ఉందని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. అదే హిట్ సిరీస్ విలన్స్.

విలన్స్‌గా పాపులర్ నటులు ఎందుకు ఉండరు?
డాక్టర్ శైలేష్ కొలను తన సినిమాల్లో విలన్ రోల్స్ ను బాగా రాసుకుంటారు. 'హిట్' సిరీస్ సినిమాలు మొత్తం అద్భుతమైన ట్విస్ట్‌లతో సాగుతాయి. హీరోలుగా క్రేజీ యాక్టర్స్ ని పెడతారు. కానీ విలన్ రోల్ వచ్చేసరికి పెద్దగా పాపులర్ లేని నటుల్ని ఎంపిక చేస్తారనే విమర్శ శైలేష్ మీద ఉంది 

నవీనా రెడ్డి... మొదటి 'హిట్'లో విలన్! 
'హిట్ ఫస్ట్ కేస్'లో హీరోగా విశ్వక్సేన్ అదరగొట్టినా సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా సాగినా చివర్లో విలన్ విషయంలో కొంత అసంతృప్తి ఆడియన్స్ లో ఇప్పటికే ఉంది. ఈ సినిమాలో విలన్ గా నవీనా రెడ్డి కనిపిస్తుంది. ఆమె పెద్దగా పాపులర్ కాదు. పైగా ఆమె బ్యాక్ స్టోరీ కూడా మరీ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. హిట్ సిరీస్లో బెస్ట్ మూవీగా చెప్పుకునే ఈ ఫస్ట్ పార్ట్ లో విలన్ రోల్ కాస్త డిజప్పాయింట్ చేసిందని ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు.

సుహాస్... 'హిట్ 2'లో విలన్ మంచి నటుడే!
'హిట్ ది సెకండ్ కేస్'లో హీరోగా అడవి శేష్ నటిస్తే విలన్ గా సుహాస్ కనిపించాడు. ఈ సినిమాలో విలన్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంటుంది. ఆ పాత్రపై ఒక సింపతీ కూడా ఉంటుంది. సుహాస్ అద్భుతంగా నటించాడు. అతను పాపులర్ యాక్టర్ కూడా. అయినప్పటికీ సినిమాలో హీరో శేష్ పర్సనాలిటీ ముందు సుహాస్ తేలిపోయాడనే కామెంట్స్ వినిపించాయి. హైట్ లో అడవి శేష్ తో పోలిస్తే సుహాస్ హైట్ బాగా తక్కువగా కనిపించడమే దీనికి కారణం. తనకంటే చాలా హైట్ ఉన్న అడవి శేష్, మీనాక్షి చౌదరి ఇద్దరినీ ఒకేసారి కట్టేసి సుహాస్ టార్చర్ చేయడం ఆడియన్స్ కి సరిగా కరెక్ట్ కాలేదని విమర్శలు వినిపించాయి.

ఇప్పుడు 'హిట్ 3'లో ప్రతీక్ బబ్బర్ చేశాడు!
'హిట్: ది థర్డ్ కేస్'లో విలన్ గా ప్రతీక్ బబ్బర్ నటించాడు. స్పాయిలర్ కాకూడదని ఎక్కువ గా ఆ పాత్ర గురించి ఇక్కడ రివీల్ చేయడం లేదు. బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నా ప్రతీక్ బబ్బర్ కి ఇప్పటికి సరైన బ్రేక్ లేదు. తెలుగు ప్రేక్షకులకు అయితే అతను ఎవరో తెలియదు. ఒక పక్క నాని అద్భుతంగా నటిస్తుంటే తనకు ఆపోజిట్ లో ఉండే విలన్ రోల్ లో ఉండే నటుడు ఎవరో తెలియకపోవడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించింది. ఇక్కడ ఒక పాపులర్ నటుడు ఉంటే బాగుండేదని కామెంట్స్ వినబడుతున్నాయి. సినిమా హిట్ అయింది కాబట్టి సరిపోయింది గాని  ఏమాత్రం తేడా జరిగినా ప్రధానమైన విమర్శ ఇదే అయ్యుండేది.

Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్‌? ఈ రెండు సినిమాల్లో ఏముంది?

ఏమీ చేయలేని డైలామా లో డైరెక్టర్ శైలేష్
అయితే ఇక్కడ డైరెక్టర్ శైలేష్ కొలనుని కూడా అర్థం చేసుకోవాలి. 'Hit' సీరిస్ ప్రధానం గా సీరియల్ కిల్లర్లు, సైకోపాత్ లు చేసే భయంకరమైన హత్యలను ఇన్వెస్ట్గేట్ చేసే కథాంశాలతో రూపొందుతున్నాయి. ఇలాంటి కథల్లో విలన్ గా  ఎవరన్నా పాపులర్ నటుడ్ని పెడితే ప్రేక్షకులు విలన్ ఎవరో ముందుగానే గెస్ ప్రమాదం ఉంది. దానివల్ల సినిమాపై చూసి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సస్పెన్స్ సినిమాల్లో విలన్ ఎవరో తెలిసి పోయాక ఇక ఆ సస్పెన్స్ కొనసాగదు. పోనీ అలాగని ప్రేక్షకులకు పెద్దగా తెలియని నటుడ్ని పెడితే విలన్ వీక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దానితో విచిత్రమైన డైలమాలో చిక్కుకుపోయారు  Hit సిరీస్ డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను. 

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget