Hero Vishal: ఫిల్మ్ ఛాంబర్ గొడవ - నిర్మాతల మండలికి విశాల్ వార్నింగ్, ఏమన్నాడంటే..
Hero Vishal Controversy: తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు తమిళ హీరో విశాల్ వార్నింగ్ ఇచ్చాడు. తాను సినిమాలు చేస్తూనే ఉంటానని, కావాలంటే తనని ఆపేందుకు ట్రే చేయండి అంటూ సవాలు విసిరాడు.
Hero Vishal Warning to Producers Council: హీరో విశాల్ తరచూ ఏదోక వివాదంలో నిలుస్తుంటాడు. గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ గుత్తాధిపత్యాన్బ్ని, థియేటర్ల మాఫియాని ప్రశ్నించాడు. ఇప్పుడు తమిళ నిర్మాతల మండలితో వాగ్వాదానికి దిగాడు. అయితే నిర్మాతల మండలికి సంబంధించిన రూ. 12 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ సినిమాలు చేయొద్దని నిర్మాతల మండలి అల్టిమేటర్ జారీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. "ఇది మీ టీంలోని వ్యక్తి మిస్టర్ కతిరేషన్‌తో కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయమని మీకు తెలియదా? నిర్మాతల మండలిలోని వృద్ధులు, కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసమే ఆ నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాం. కౌన్సిల్ సభ్యులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా పండుగల సమయంలో ప్రాథమిక సంక్షేమం ఇచ్చాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేయబడ్డాయి. మీరు అక్కడ మీ పనిని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చాలా పని ఉంది. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.
విశాల్ ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు.కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు. నిర్మాతలు అని పిలవబడే.. ఎప్పటికి సినిమాలు నిర్మించలేని ప్రోడ్యూసర్స్ మీరు. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా? ఆలోంచించండి" అంటూ విశాల్ వివాదస్పద పోస్ట్ చేశాడు. ప్రస్తుతం విశాల్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. గతంలో విశాల్ నటించిన రత్నం మూవీ ఇటీవల విడుదలైంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో 'డిటెక్టివ్ 2' చేస్తున్నాడు. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన 'డిటెక్టివ్' చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.
View this post on Instagram
అయితే దర్శక హీరోల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా డైరెక్టర్ ను తొలగించి, సీక్వెల్ కు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు విశాల్. 'పందెం కోడి' 'పొగరు' 'భరణి' 'వాడు వీడు' వంటి చిత్రాలతో టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ 'పందెం కోడి 2' 'యాక్షన్' 'చక్ర' 'ఎనిమీ' 'సామాన్యుడు' 'లాఠీ' లాంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. అయితే గతేడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ‘రత్నం’, 'డిటెక్టీవ్ 2' చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. మరి ఈ సినిమాలు విశాల్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.