Sai Dharam Tej: గొప్ప మనసు చాటుకున్న సాయి దుర్గ తేజ్ - ప్రాణాలు కాపాడారంటూ పావలా శ్యామల ఎమోషనల్
నటనారంగంలో 3 దశాబ్దాలకు పైగా అపార అనుభవం ఉన్న నటీమణి పావలా శ్యామల.. చివరి దశలో అత్యంత దయనీయ జీవితం గడుపుతోంది. విషయం తెలుసుకున్న నటుడు సాయి దుర్గ తేజ్ ఆమెకు ఆర్థిక సాయం చేశారు.
Sai Dharam Tej Donates Money To Pavala Shyamala: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పావలా శ్యామల దీనావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకుని సాయం చేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ద్వారా పావలా శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఎమోషనల్ అయిన పావలా శ్యామలా
నటుడు సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావలా శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన దీనస్థితి గురించి చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి దుర్గ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి పావలా శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని సాయి తేజ్ భరోసా ఇచ్చారు. “యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించాను” అని సాయి తేజ్ కు చెప్పింది. ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో మెగాస్టార్ చిరంజీవి తనకు చేసిన ఆర్థిక సాయాన్ని నటి పావల శ్యామల గుర్తు చేసుకున్నారు.
మూడు దశాబ్దాల సినీ ప్రయాణం
నటి పావలా శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నాటకాలతో మొదలైన ఆమె ప్రస్తానం సినిమాల వరకు మూడు దశాబ్దాలకుపైగా నటనారంగంలో రాణించింది. ఎంతో మంది అగ్రహీరోల సినిమాల్లో నటిగా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని నేచురల్ స్టార్ నాని సినిమాల వరకు తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకుంది. కళనే జీవితంగా మార్చుకున్న పావలా శ్యామలకు గత కొంతకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. ఇంటి కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేక అనాథ ఆశ్రమంలో ఉంటుంది.
నటి శ్యామలాకు పలువురి ఆర్థిక సాయం
నటి పావలా శ్యామలా గురించి తెలియడంతో పలువురు ఆమెకు ఆర్థికసాయం చేశారు. ఈమె దీని స్థితి గురించి తెలుసుకుని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆమెకు అండగా నిలుస్తామని చెప్పారు. ప్రగతి భవన్ కు పిలిపించుకుని ఆమెతో మాట్లాడారు. తక్షణ సాయం కింద ఆమెకు రూ. 20 వేలు ఇప్పించారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున నెలకు రూ. 10 వేల పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు అప్పట్లో ఆర్థికసాయం చేశారు.
Also Read: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?