Nithiin Blessed With Baby Boy: నితిన్ ఇంట వారసుడొచ్చాడు... పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన షాలిని కందుకూరి
Nithiin Becomes Father: హీరో నితిన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య షాలిని ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నితిన్ తెలియజేశారు.
వచ్చాడు... వచ్చాడు... వారసుడు వచ్చాడు... హీరో నితిన్ (Nithiin) ఇంట వారసుడు వచ్చాడు. ఆయన భార్య, డాక్టర్ షాలిని కందుకూరి పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చారు. ఆ సంగతి సోషల్ మీడియాలో షేర్ చేశారు నితిన్ దంపతులు. తమ ఇంటికి కొత్త స్టార్ (Nithiin Son First Photo)ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024
తల్లిదండ్రులు అయిన నితిన్, షాలిని దంపతులకు పలువురు ప్రముఖులు శుభాకంక్షాలు చెబుతున్నారు. హీరోల్లో నితిన్ సన్నిహితుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సహా స్టార్ హీరోయిన్ సమంత, శ్రియ శరణ్, దర్శకులు వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల తదితరులు కంగ్రాట్స్ చెప్పారు.
నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్న నితిన్
Nithiin and Shalini Wedding Date: నితిన్ నాలుగేళ్ల క్రితం షాలినీతో ఏడు అడుగులు వేశారు. జూలై 26, 2020లో ఈ దంపతులు ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అప్పటి నుంచి పలు సందర్భాలలో నితిన్ ముందు పిల్లల ప్రస్తావన తీసుకు వచ్చారు పలువురు. అయితే... నితిన్ నవ్వుతూ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేసేవారు. ఇప్పుడు గుడ్ న్యూస్ షేర్ చేశారు.
Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నితిన్!
Nithiin Upcoming movies: ఇప్పుడు నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. 'భీష్మ' వంటి విజయవంతమైన సినిమా ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' చేస్తున్నారు. అందులో శ్రీ లీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది.
నితిన్ హీరోగా చేస్తున్న మరో సినిమా 'తమ్ముడు'. ఆయన అభిమాన కథానాయకుడు పవన్ కల్యాణ్ హిట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు 'వకీల్ సాబ్' ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు.
Also Read: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి