Nikhil Siddhartha: భార్య సీమంతం - సంతోషంగా ఫోటో షేర్ చేసిన నిఖిల్
Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తన తండ్రి కాబోతున్నాడంటూ ఒక హ్యాపీ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.
Nikhil Siddhartha Wife Seemantham: యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడంటూ గత కొంతకాలంగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి నిఖిల్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా తను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోతో.. రూమర్స్‌పై ఒక క్లారిటీ వచ్చింది. తన భార్య పల్లవి సీమంతం ఫోటోను సంతోషంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు నిఖిల్. దీంతో ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తూ.. వారిని విష్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిన నిఖిల్.. త్వరలోనే తండ్రి కాబోతున్నానంటూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆశీస్సులు కావాలి..
‘సీమంతం.. బేబీ షవర్‌కు సాంప్రదాయమైన ఇండియన్ పద్ధతి. మా మొదటి బేబీ కోసం ఎదురుచూస్తున్నామని పల్లవి, నేను సంతోషంగా ప్రకటిస్తున్నాం. మీ ఆశీస్సులను పంపించండి’ అంటూ అందమైన క్యాప్షన్‌తో సీమంతం ఫోటోను షేర్ చేశాడు నిఖిల్. ఇక ఈ పోస్ట్‌కు నిఖిల్ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. కంగ్రాట్స్, లవ్ యూ అంటూ తమ అభిమాన హీరో సంతోషాన్ని పంచుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక నిఖిల్ షేర్ చేసిన ఈ ఫోటోలో.. ఈ హీరో ఒక సింపుల్ వైట్ షర్ట్‌లో కనిపించగా.. పల్లవి మాత్రం పట్టుచీరలో తన బేబీ బంప్‌తో అందంగా కనిపిస్తోంది. నిఖిల్, పల్లవి చాలా సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత 2020లో పెళ్లి చేసుకున్నారు.
View this post on Instagram
‘స్వయంభు’తో బిజీ..
ప్రస్తుతం నిఖిల్.. ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడంతో పాటు పూర్తిగా తన లుక్‌ను కూడా మార్చేశాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. అప్పుడప్పుడు దీని గురించి అప్డేట్స్‌ను కూడా అందిస్తున్నాడు. ఇందులో నిఖిల్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. దసరాకు ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని నిఖిల్ ప్రకటించినా.. ఇలాంటి ఒక పీరియాడిక్ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఆలస్యం అవుతుంటుందని.. షూటింగ్ త్వరగా పూర్తి చేయకపోతే ‘స్వయంభు’ దసరాకు థియేటర్లలో విడుదల అవ్వడం కష్టమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘కార్తికేయ 2’తో సెన్సేషన్..
నిఖిల్ చివరిగా కనిపించిన చిత్రం ‘18 పేజెస్’. ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచినా.. దానికంటే ముందు తను నటించిన ‘కార్తికేయ 2’ మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఈ సినిమాకు ఎక్కువగా ఆదరణ లభించింది. దీంతో నిఖిల్ పేరు బాలీవుడ్‌లో కూడా మారుమోగిపోయింది. అందుకే మేకర్స్ అంతా ప్రస్తుతం తనతో పాన్ ఇండియా చిత్రాలు చేయడానికి ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా నిఖిల్‌కు ఒక మార్కెట్ ఏర్పడడంతో తన తరువాతి చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Also Read: ప్రతీ విషయంలో తన అభిప్రాయం నాకు అవసరం - విజయ్ గురించి రష్మిక ఆసక్తికర కామెంట్స్