Hero Nikhil: మూసి ఉన్న గుడిని తెరిపించిన యంగ్ హీరో నిఖిల్ - పూలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో వైరల్
Nikhil Opened Old Temple: యంగ్ హీరో నిఖిల్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా మూసి ఉన్న గుడిని తెరిపించి అక్కడ పూజల జరిగేలా బాధ్యతలు తీసుకున్నాడు ఈ హీరో.
![Hero Nikhil: మూసి ఉన్న గుడిని తెరిపించిన యంగ్ హీరో నిఖిల్ - పూలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో వైరల్ Hero Nikhil Opened Old Temple in Chirala Village In Andhra Pradesh Hero Nikhil: మూసి ఉన్న గుడిని తెరిపించిన యంగ్ హీరో నిఖిల్ - పూలతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, వీడియో వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/48ef8b6007ef91338c69d3fb44eac2f91717608347673929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hero Nikhil Opened Old Temple in Chirala Village: యంగ్ హీరో నిఖిల్ చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్నేళ్లుగా మూసి ఉన్న గుడిని తెరిపంచడమే కాదు దాని నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడట. దీంతో నిఖిల్ నిర్ణయాంపై ఆ గ్రామస్తులు అభిమానం కురిపించారు. ఇంతకి అసలు విషయం ఎంటంటే. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. దీనిని పట్టించుకునేవారు, నిర్వాహకులు లేక ఆలయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో నిఖిల్ ముందుకు వచ్చి ఆ ఆలయాన్ని తెరిపించాడు. అంతేకాదు దాని నిర్వాహణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా మూసీ ఉన్న ఆలయాన్ని నిఖిల్ తెరిపించడంతో గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపించారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలు పరిచి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇక నిర్ణయంపై నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా నిఖిల్ శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన ఆయన హ్యాపీ డేస్ వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో హీరోగా మారాడు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక హీరోగా నిఖిల్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా 'కార్తికేయ 2' కూడా తీసుకువచ్చాడు. పాన్ ఇండియాగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. తన కెరీర్‌లోనే హయ్యేస్ట్ గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాగా కార్తికేయ 2 నిలిచింది. ప్రస్తుతం 'స్వయంభు' సినిమాతో బిజీగా ఉన్నాడు.
View this post on Instagram
పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా తెరకెక్కుతుంది. ఇందులో నిఖిల్ సరసన నభ నటేష్, సంయుక్తి మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నిఖిల్ వారియర్‌గా కనిపించబోతున్నాడు. తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భువన్ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనితో పాటు నిఖిల్ చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే అతడు హీరోగా రామ్‌చరణ్ నిర్మాణంలో 'ది ఇండియన్ హౌజ్' అంటూ ఓ భారీ ప్రాజెక్ట్‌ణి పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. అలాగే కార్తికేయకు మూడో పార్ట్ కూడా ఉండనుంది. ఇలా వరుస పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌తో ఈ యంగ్ హీరో ఫుల్ బిజీ అయిపోయాడు.
Also Read: నటి హేమకు మంచు విష్ణు షాక్! - 'మా' సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)