
Hero Nara Rohit: అందుకే నా జాతకం చెప్పలేదేమో, వేణు స్వామిపై నారా రోహిత్ పంచ్
Hero Nara Rohit: నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో రిపోర్టర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకి నారా రోహిత్ కొన్ని ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.

Hero Nara Rohit Funny Comments on Astrologer Venu Swamy : నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్ జంటగ నటిస్తున్న సినిమా 'సుందరకాండ'. ఈ సినిమా వినాయకచవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ తర్వాత నారా రోహిత్, సినిమా టీమ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి నారా రోహిత్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు. వేణుస్వామి గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఏమన్నారంటే?
"సినిమాకి అన్నీ బాగా కలిసొచ్చాయి మీ నక్షత్రం ఏంటండి" అని డైరెక్టర్ ని అడిగిన ప్రశ్నకి ఆయన ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. "నాది మాత్రం మూలా నక్షత్రం కాదండి.. నేను హ్యాపీగానే ఉంటాను" అని చెప్పారు. నిజానికి సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్ సిదార్ధ. ఆయనది మూల నక్షత్రం.. ఐదు నిమిషాలు కూడా హ్యాపీగా ఉండదు. దీంతో దానికి రిలేటెడ్ గా డైరెక్టర్ ఆ ఫన్నీ ఆన్సర్స ఇచ్చారు. ఇక నారా రోహిత్ మాట్లాడుతూ స్వాతి నక్షత్రం అని చెప్పుకొచ్చారు. దీంతో జోతిష్యుడు వేణు స్వామి ప్రస్తావన వచ్చింది. వెంటనే ఒక రిపోర్టర్ "ఆయన ఎందుకు ఎప్పుడూ మీ జాతకం చెప్పలేదు" అని అడిగితే.. "ఆయనకు నా జాతకం తెలియదు, వివరాలు తెలియదేమో అందుకే చెప్పలేదు" అంటూ నవ్వేశారు నారా రోహిత్.
ఇటీవల జోతిష్యుడు వేణుస్వామికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, వాళ్ల పర్సనల్ విషయాల గురించి చెప్పడం తీవ్ర వివాదానికి దారితీసింది. నాగచైతన్య, శోభిత ఇద్దరు విడిపోతారు అంటూ వేణుస్వామి చేసిన కామెంట్స్ పై చాలామంది ఫైర్ అయ్యారు. ఆయనపై మహిళ కమిషన్ కి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఆయన ఒక టాపిక్ అయిపోయారు.
టీజర్ ఎలా ఉందంటే?
ఇక టీజర్ విషయానికొస్తే.. చాలా ఫన్నీగా సాగింది టీజర్. నారా రోహిత్ పెళ్లి చేసుకోవాడానికి ఒక అమ్మాయి కోసం వెతుకున్నట్లుగా అర్థం అవుతుంది. ఈ యాంగిల్ లో ఫన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేశారు డైరెక్టర్. తనది మూలా నక్షత్రం అని, ఐదు నిమిషాలు కూడా హ్యాపీగా ఉండనని లైఫ్ గురించి చెప్తారు నారా రోహిత్. తనకు పెళ్లి చేసుకునే అమ్మాయిలో ఐదు క్వాలిటీస్ ఉండాలని చెప్తారు. మరి ఆ క్వాలీటీస్ ఏంటి? అసలు పెళ్లి అవుతుందా? లేదా అనేది సినిమాలో చూడాలి.
సుందరకాండ సినిమాలో నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తున్నారు ఆమె. ఇక ఈ సినిమాలో నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్ డైరెక్టర్ కాగా.. సంతోష్ చిన్నపొల్లా, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహాంకాళి.. ‘సుందరకాండ’ను నిర్మిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కుతోంది.
Also Read: కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ... ఆహా కాదండోయ్, మరో వేదికలో నిహారిక నిర్మించిన సినిమా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
