అన్వేషించండి

Mahesh Babu: ఈ మధ్య ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు - ‘ప్రేమలు‘ మూవీపై మహేష్ బాబు రివ్యూ చూశారా?

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు‘పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురపించారు. ఈ మధ్య కాలంలో ఇంతలా ఎప్పుడూ నవ్వలేదంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Mahesh Babu Review On ‘Premalu’ Movie: రీసెంట్ గా మలయాళంలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు‘. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేరళలో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమా మార్చి 8న తెలుగులోనూ విడుదల అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. ‘ప్రేమలు’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.  

‘ప్రేమలు’ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు

పలువురు టాలీవుడ్ స్టార్లు సైతం ‘ప్రేమలు’ సినిమాను చూస్తున్నారు.  తాజాగా ఈ లిస్టులో చేరారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీసెంట్ గా ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ను చూసిన ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ప్రేమలు’ డబ్బింగ్ వెర్షన్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కార్తికేయతో పాటు ఈ సినిమా బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. "’ప్రేమలు’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కార్తీకేయ. ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశాను. చివరిసారిగా ఓ సినిమా చూస్తూ ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో అస్సలు గుర్తులేదు. నా ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. యువకులంతా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రబృందానికి నా అభినందనులు” అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు.

మహేష్ కు థ్యాంక్స్ చెప్పిన కార్తికేయ

అటు మహేష్ ప్రశంసలపై కార్తికేయ స్పందించారు. ఆయన ట్వీట్ కు రీ ట్వీట్ చేశారు. “సర్.. మీ నుంచి ప్రశంసలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. మీ ట్వీట్‌ను చూసిన తర్వాత నేను ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నాను. మీ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసినందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ సర్” అని రాసుకొచ్చారు.

రూ.100 కోట్లు వసూలు చేసిన ‘ప్రేమలు’  

గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజు జంటగా నటించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో ఈ సినిమా విడుదల కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మార్చి 8న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ సైతం ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. శ్యామ్ పుష్కరన్, దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  

రాజమౌళితో మహేష్ మూవీ

అటు ప్రస్తుతం మ‌హేష్‌ బాబు రాజమౌళితో కలిసి ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఆయన మేకోవర్ కూడా పూర్తి డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది.

Read Also: ‘హనుమాన్‘ to 'భ్రమయుగం' - ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న రెండు డజన్ల సినిమాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget