Dhanush: ఇళయరాజాగా మారనున్న హీరో ధనుష్ - మ్యాస్ట్రో బయోపిక్‌లో ధనుష్
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోఫిక్ లో నటించనున్న సౌతిండియా బ్రూస్లీ కొలీవుడ్ టాప్ హీరో ధనుష్
సినీ పరిశ్రమలో ప్రముఖుల బయోఫిక్ లు తెరకెక్కించడం కొత్తేమి కాదు. క్రికెటర్ల నుంచి సినిమా తారల జీవితాల వరకు అటు రాజకీయ నాయకుల నుంచి ఏకంగా అండర్ వరల్డ్ డాన్‌లు, స్మగ్లర్ల జీవితాలపై కూడా బయోఫిక్ లు వచ్చాయి. బయోఫిక్ లు గా తెరకెక్కిన అన్ని సినిమాలు విజయం సాధించలేదు. కొన్ని సినిమాలు హిట్టైతే.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఒకటి అరా మాత్రమే బ్లాక్ బ్లస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు లాభాల పంట పండిచాయి. తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోఫిక్ రానున్నట్లు కొలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బయోఫిక్‌లో కొలీవుడ్ టాప్ హీరో ధనుష్ నటిస్తున్నట్లు వార్తలు వినిస్తున్నాయి.
భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మ్యూజిక్ మ్యాస్ట్రోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా ఇప్పటివరకు ఐదు దశాబ్దాలుగా వెయ్యికిపైగా సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన టైటిల్ రోల్ పోషిస్తున్న‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు ధనుష్ కథ సమకూర్చి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించబోతున్న మరో సినిమా ‘డీ 50’తో పాటు తెలుగులో ‘హ్యాపీడేస్’ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో కూడా మరో సినిమా చేసేందుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇళయరాజ బయోపిక్ 2024లో పట్టాలు ఎక్కబోతుందని, 2025లో రిలీజ్ కానుందని సమాచారం. ఇక ఈ సినిమాని ‘కనెక్ట్ మీడియా’ నిర్మించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘మాస్ట్రో’ అనే టైటిల్ ని ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు సమాచారం. కొన్ని నెలలు క్రిందట యువన్ శంకర్ రాజా కూడా ఈ బయోపిక్ గురించి మాట్లాడారు. తన తండ్రి పాత్రలో ధనుష్ ని చూడడం చాలా సంతోషంగా ఉన్నట్లు యువన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ బయోపిక్ ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇళయరాజా 1000 పైగా సినిమాల్లో 7000 కు పైగా సాంగ్స్ ని చేశారు. 50 ఏళ్ళ కెరీర్ లో 20,000 పైగా కాన్సర్ట్స్ ఇచ్చారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఇళయరాజా.