Eagle Day 2 Collections: ‘ఈగల్’ సెకండ్ డే కలెక్షన్స్ - పెద్దగా మారని లెక్కలు!
Eagle Collections: రవితేజ, కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఈగల్’ మూవీ కలెక్షన్స్‌లో రెండోరోజు కూడా పెద్దగా మార్పులు లేవు. మౌత్ టాక్ బాగానే ఉన్న కలెక్షన్స్ మాత్రం వీక్‌గా ఉన్నాయి.
Eagle Box Office Collections: మౌత్ టాక్ బాగుంటే.. ఏ సినిమా అయినా ముందు స్లోగా స్టార్ట్ అయినా వెంటనే కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీ పరిస్థితి కూడా అలాగే ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాగానే ఉందని, థియేటర్లలో చూడవచ్చని చాలామంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. అందుకే ఫస్ట్ డేతో పాటు సెకండ్ షో కలెక్షన్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మూవీ టీమ్ ఆశలు అన్నీ వీకెండ్‌పైనే ఉన్నాయి.
తక్కువ ఆక్యూపెన్సీతో..
కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రవితేజ హీరోగా నటించిన చిత్రమే ‘ఈగల్’. ఈ సినిమాకు ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.11 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో మెల్లగా మౌత్ టాక్ వల్ల ‘ఈగల్’ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావించారు. రెండోరోజు ‘ఈగల్’ డీసెంట్‌గా హెల్డ్ చేసిందని సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ మూవీకి దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్ దక్కినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా 32.84 శాతం ఆక్యూపెన్సీతో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. మార్నింగ్ షోలకంటే ‘ఈగల్’ సెకండ్ షోలకే ఎక్కువగా డిమాండ్ ఉంది.
హిందీలో ఫెయిల్..
రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’.. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలయ్యింది. కానీ హిందీలో కలెక్షన్స్ అంతగా లాభంగా కనిపించడం లేదు. మొదటిరోజు హిందీ కలెక్షన్స్ రూ.0.1 కోటిగా ఉండగా.. రెండోరోజు మాత్రం కాస్త పెరిగి రూ.0.13 కోట్లకు చేరాయి ‘ఈగల్’ లెక్కలు. మొత్తానికి దేశవ్యాప్తంగా ‘ఈగల్’ కలెక్షన్స్ రూ.10 కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి. మౌత్ టాక్ బాగానే ఉన్నా.. ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించేలా లేకపోవడంతో ఈ మూవీ రన్ త్వరగానే పూర్తవుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సినిమా ఆక్యూపెన్సీ చూస్తుంటే బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అని విమర్శలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్‌గా గుర్తింపు..
‘ఈగల్’లో రవితేజకు జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా ద్వారా కార్తిక్ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. దీంతో తాను సినిమాటోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు డైరెక్టర్‌గా కూడా ప్రయోగాలు చేయవచ్చని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. ‘ఈగల్’ విడుదల అవ్వకముందే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలోనే దీనికి సీక్వెల్ ఉండాలని ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. ‘ఈగల్ యుద్ధ కాండ’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. దీనికి మించి వివరాలు ఏమీ బయటపెట్టలేదు మూవీ టీమ్.
Also Read: మహేశ్, రాజమౌళి మూవీలో ఇండోనేషియన్ నటి - ఇన్‌స్టాగ్రామ్ చూసి కన్ఫర్మ్ చేసేస్తున్న నెటిజన్లు