Hanuman Movie: మాట నిలబెట్టుకున్న 'హనుమాన్' మేకర్స్ - అయోధ్య రామ మందిరం కోసం భారీ విరాళం
Hanuman Movie: ఆ విషయంలో 'హనుమాన్' మూవీ మేకర్స్ మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగా అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ప్రకటించారు. ప్రీమియర్ షోలకు వచ్చిన మొత్తాన్ని అయోధ్యకు కానుకగా ఇచ్చారు.
Hanuman Movie Donation: తెలుగు బాక్సాఫీసు వద్ద సంక్రాంతి సందడి మొదలైంది. పండగ కానుకగా గుంటూరు కారం, 'హనుమాన్' వంటి టాప్ చిత్రాలతో పాటు మరిన్ని థియేటర్లో రిలీజ్ అయ్యాయి. వాటిన్నింటి హనుమాన్ బీట్ చేసి హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ రోజు రిలీజ్ ఉండగా నిన్న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రిమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హను-మాన్ సంక్రాంతి హిట్ కొట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా హను-మాన్ సినిమా గురించే మాట్లాడుకుంటుంది.
అంతా ప్రశాంత్ వర్మ స్కిల్స్, మేకింగ్‌ని కొనియాడుతున్నారు. 'హనుమాన్'ను వర్మ టేక్ చేసిన తీరుపై ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అంతా సూపర్ హీరో జానర్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ మేకర్స్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో విషయంలో 'హనుమాన్' నిర్మాతలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాగా ఈ సినిమాను ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చెప్పారు..
'హనుమాన్' మూవీ ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రశాంత్ వర్మ స్క్రిన్‌ప్లే, డైరెక్షన్ అనగానే ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. ఇక మూవీ ప్రచార పోస్టర్స్, ట్రైలర్ మూవీపై మరింత హైప్ పెంచాయి. ఈ క్రమంలో మూవీకి వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ అయోధ్య రామమందిరం కోసం టికెట్‌కు రూ. 5 రూపాయల చొప్పున విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చెప్పినట్టుగా ఇప్పుడు నిర్మాత మాట నిలబెట్టుకున్నారు. నిన్నటి ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ. 14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తున్నట్టు తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్‌లో నిరంజన్ రెడ్డి తెలిపారు. అంతేకాదు మూవీ థియేటర్లో ఆడినంత కాలం టికెట్‌కు రూ. 5 చొప్పున విరాళం ఇస్తూనే ఉంటామన్నారు. కాగా రాముడికి పరమభక్తుడైన హనుమంతుడు.. ఆ పేరుతో తెరకెక్కిన హను-మాన్ మూవీ నుంచి విరాళం వెళ్లడంపై ప్రతిఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'గుంటూరు కారం' వర్సెస్ 'హను-మాన్'
సంక్రాంతికి మరింత వినోదం అందించేందుకు థియేటర్లో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మెయిన్‌గా గుంటూరు కారం, హను-మాన్‌పై చిత్రాలపైనే ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ కొనసాగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ తో యంగ్ హీరో తేజ సజ్జ ఢీకొట్టారు మరింత ఆసక్తి కనబరుస్తోంది.
విడుదలకు ముందే ‘గుంటూరు కారం‘తో పోల్చితే, ‘హనుమాన్‘ మూవీ టికెట్ బుకింగ్స్ లో టాప్ లో కొనసాగింది. అంతేకాదు, ‘హనుమాన్‘ సినిమా చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక టికెట్ల సేల్ విషయంలోనూ మహేష్ మూవీతో పోల్చితే తేజ సజ్జ మూవీ దూసుకెళ్తోంది. గంట వ్యవధిలో ‘గుంటూరు కారం‘ సినిమా 16 వేల టికెట్లు బుక్ కాగా, ‘హనుమాన్‘ మూవీ సుమారు 20 వేల టికెట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ మూవీ బుకింగ్స్ లో వెనుకబడింది.
Also Read: సంక్రాంతి హిట్ కొట్టిన 'హనుమాన్' - ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? తేజా సజ్జాకు ఎంతంటే!