Prasantha Varam Post: ఫోటో మూమెంట్, ప్రశాంత్ వర్మ మూవీ సెట్‌లో కొత్త డైరెక్టర్ - 'ఈ వైరల్ గాయ్‌ని గుర్తుపట్టారా?'
Director Prasanth Varma: ప్రశాంత్ వర్మ మూవీ సెట్‌లో కొత్త డైరెక్టర్ మెరిశారు. హనుమాన్ మూవీ రిలీజ్ టైంలో ఈ వ్యక్తి తన కామెంట్స్‌తో బాగా వైరల్ అయ్యారు. ఆయనే ఎవరో గుర్తుపట్టారా?
Director Prasanth Varma Photo Movement:'హనుమాన్' మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. 'కల్కి', 'ఆ!', 'జాంబిరెడ్డి' వంటి సినిమాలతో తన టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ 'హనుమాన్'తో ఏకంగా సినిమాటిక్ వరల్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు గతంలో ఓ ఇంటర్య్వూలో తన దగ్గర ఇంకా సూపర్ హీరో జానర్లో మైథలాజికల్ కథలు చాలానే ఉన్నాయని చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో అంతా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ ఎలా ఉండబోతుందోని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ హనుమాన్ మూవీ రిలీజ్ టైంలో ఓ వ్యక్తి బాగా వైరల్ అయ్యారు. ఆయన ప్రశాంత్ వర్మకు చాలా దగ్గరి వ్యక్తి.
ఈ వైరల్ వ్యక్తిని గుర్తుపట్టారా?
'హనుమాన్' సినిమాను థియేటర్లో చూసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఆ వ్యక్తే ప్రశాంత్ వర్మ కొత్త మూవీ సెట్‌లో మెరిశారు. స్వయంగా ఆయన ఫోటోను ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మూవీ సెట్‌లో డైరెక్టర్ స్థానంలో కూర్చుని ఉన్న ఆయన ఫోటోను షేర్ చేస్తూ "సెట్‌లోకి కొత్త డైరెక్టర్ వచ్చారు! ఈ వైరల్ వ్యక్తి.. ఆయన చెప్పిన ఫేమస్ డైలాగ్ గుర్తోచ్చిందా?" అంటూ ప్రశాంత్ వర్మ తన పోస్ట్‌కి రాసుకొచ్చారు. కాగా ఆయన ఎవరో కాదు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తండ్రి. 'హనుమాన్' సినిమా చూసిన ఆయన థియేటర్ బయట మీడియాతో మాట్లాడుతూ.. 'మూవీ చాలా బాగుందని, ఈ సినిమా తీసినోడు నా కొడుకే' అంటూ సగర్వంగా చెప్పుకున్నారు.
New director on set! 😎
— Prasanth Varma (@PrasanthVarma) March 20, 2024
Remember this viral guy and his famous line? 😊 pic.twitter.com/9Ml62CcITB
అప్పుడాయన ముఖంతో పుత్రోత్సాహం కనిపించింది. కొడుకు సక్సెస్‌ని స్వయంగా ఆస్వాధించిన ఆయనన ఎమోషల్ కామెంట్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ.. తండ్రిని డైరెక్టర్ సీట్‌లో కూర్చోబెట్టి మురిసిపోయారు. ఈ స్పెషల్ మూమెంట్‌ని తన ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేస్తూ కొడుకుగా మురిసిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఫోటో ప్రశాంత్ వర్మ మరో చిత్రం 'అక్టోపస్' మూవీ సెట్‌లోనిది అని తెలుస్తుంది. కాగా ఆయన ప్రస్తుతం అనుపమతో 'అక్టోపస్' అనే మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఓటీటీలోనూ అదరగొడుతున్న 'హనుమాన్'
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ-అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా 'హనుమాన్' మూవీ తెరకెక్కింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీని సైతం వెనక్కి నెట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం థియేట్రీకల్ రన్‌లో దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు సమాచారం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన 'హనుమాన్' ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది. ఇటీవల జీ5కి వచ్చిన సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చిన కొన్ని గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్పింది. జస్ట్ పదకొండు గంటల్లోనే హనుమాన్ ఓటీటీలో నిమిషానికి మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా వరల్డ్ వైడ్‌గా ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో నిలిచి ట్రెండింగ్ వచ్చింది.