అన్వేషించండి

HanuMan: ‘హనుమాన్’ ఖాతాలో మరో రికార్డ్ - 92 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా!

HanuMan Collections: సంక్రాంతికి విడుదలయిన ‘హనుమాన్’ మూవీ గురించే ఇంకా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ.. మరో రికార్డును సొంతం చేసుకుంది.

HanuMan Box Office Collections: సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ముఖ్యంగా సంక్రాంతికి ఎన్నో తెలుగు సినిమాలు థియేటర్లలో పోటీపడతాయి. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా అందరు హీరోలకు సంక్రాంతి హిట్స్ కావాలని కోరిక ఉంటుంది. అదే విధంగా 2024 సంక్రాంతికి కూడా పలు సినిమాలు పోటీపడ్డాయి. అందులో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘హనుమాన్’. ఇప్పటికే ‘హనుమాన్’ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. కలెక్షన్స్ పరంగా టాప్ 10 తెలుగు సినిమాల్లో యాడ్ అయ్యింది. తాజాగా మరో రికార్డ్ కూడా ‘హనుమాన్’ పేరు మీద నమోదయ్యిందని తెలుస్తోంది.

రూ.300 కోట్లు వచ్చే అవకాశం

కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ విషయంలో ‘హనుమాన్’ పరుగులు పెడుతోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అమెరికాలో సైతం 5 మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది ఈ సినిమా. 2024 సంక్రాంతికి విడుదలయిన సినిమాల్లో ‘హనుమాన్’ ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ దక్కించుకుంది. టాలీవుడ్ హిస్టరీలోనే 92 ఏళ్లుగా సంక్రాంతికి ఏ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్’ కలెక్షన్స్ రూ. 260 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. అందుకే రన్ పూర్తయ్యేలోపు రూ.300 కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అలాంటి సినిమాలను దాటి..

ఇప్పటికే సంక్రాంతికి ‘అల వైకుంఠపురంలో’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ‘హనుమాన్’ వాటన్నింటినీ క్రాస్ చేసింది. 92 ఏళ్ల సినీ సంక్రాంతి చరిత్రలోనే ఇంత పెద్ద హిట్‌ను ప్రేక్షకులు చూడలేదు అంటేనే అర్థమవుతోంది ఈ మూవీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో. ప్రస్తుతం కలెక్షన్స్ విషయంలో ఇంకా ‘హనుమాన్’ వెనక్కి తగ్గడం లేదు కాబట్టి సినిమా ఓటీటీ రిలీజ్‌ను కూడా పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో కలెక్షన్స్ తగ్గడం కాకుండా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. ఒకసారి ‘హనుమాన్’ను థియేటర్లలో చూసి ఇష్టపడినవారు కూడా మళ్లీ మళ్లీ దీనికోసం థియేటర్లకు వెళ్తున్నారు.

ఎన్నో రికార్డులు..

ఇక దేవుడి కథలు, అలాంటి జోనర్‌లో తెరకెక్కిన సినిమాలంటే నార్త్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. దీనికి నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ సినిమానే ఉదాహరణ. ఇప్పుడు అదే తరహాలో, దానికి మించి సక్సెస్ అయ్యింది ‘హనుమాన్’. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వర్షన్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ‘హనుమాన్’ హిందీ వర్షన్‌కు రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ లభించాయి. ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘హనుమాన్’ సినిమాకు కోటి టికెట్లు అమ్ముడిపోయాయని సమాచారం. దీంతో 2024లో విడుదలయిన అన్ని సినిమాల్లో ఇలాంటి ఘనత సాధించిన మొదటి చిత్రంగా ‘హనుమాన్’ నిలిచింది. 

Also Read: బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్‌ క్యాన్సల్? అందుకే రద్దుచేయాల్సి వచ్చిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget