Hanuman Release Date: సమ్మర్‌లో వచ్చేస్తున్న ‘హనుమాన్’ - రిలీజ్ డేట్ ప్రకటనే ఇలా ఉంటే, మూవీ ఎలా ఉంటుందో!
తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది.
క్రియేటివ్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను మెప్పించే స్టైల్.. దర్శకుడు ప్రశాంత్ వర్మది. ఇప్పుడు ఆయన నుంచి ‘హనుమాన్’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై తెలుగు వాళ్లనే కాదు.. ఇతర దేశాల ప్రేక్షకులను కూడా అలరించేసింది. సినిమాలో చూపించిన క్రియేటివిటీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ కంటే గొప్పగా ఉందనే పేరు తెచ్చుకుంది. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీలోనే కాకుండా స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా.. మే 12న రీలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్ మరింత ఆకర్షణగా నిలిచింది. వరల్డ్ మ్యాప్‌లో హనుమంతుడిని చూపిస్తూ డిజైన్ చేసి, హనుమాన్ చాలీసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూడముచ్చటగా ఉంది. సినిమాను తక్కువ బడ్జెట్‌తోనే తీసినప్పటికీ హాలీవుడ్ రేంజ్‌లో చూపించడంలో ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ కనిపిస్తోంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హను-మాన్‌లా శక్తులు పొందిన సామాన్యుడు అంజనాద్రిని కాపాడుకోవడానికి ఏం చేశాడనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతోందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో తేజ సజ్జకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
View this post on Instagram
ఇలాంటి ఇతిహాస నేపథ్యం కలిగిన కాన్సెప్ట్‌తో మరో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘జాంబీరెడ్డి’, ‘అద్భుతం’ సినిమాలతో ప్రేక్షకులకు తన టాలెంట్‌ను రుచి చూపించిన తేజ సజ్జ ఈ సినిమా కోసం తన లైఫ్‌ని రిస్క్ చేసి మరీ కష్టపడ్డాడు. ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్ ఒకటి ఉందట. ఈ సీన్‌లో తేజ రిస్కీగా కొన్ని సెకన్ల పాటు నీటిలో ఊపిరి బిగపట్టి ఉండాలి. ఈ సీన్ బాగా రావాలని హైదరాబాద్‌లో దాదాపు 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని కష్టపడుతున్న తేజాకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఈ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అయితే మాత్రం ప్రశాంత్ వర్మ కూడా ప్రశాంత్ నీల్, ఎస్.ఎస్ రాజమౌళిలా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు.
Also Read: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్