![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guntur Kaaram New Schedule : 'గుంటూరు కారం' మళ్ళీ మొదలైంది, బర్త్ డే తప్ప పెద్దగా బ్రేకులు లేకుండా!
Mahesh Babu starts shooting for Guntur Kaaram short schedule : 'గుంటూరు కారం' లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ నగర శివరాల్లో షూటింగ్ చేస్తున్నారు.
![Guntur Kaaram New Schedule : 'గుంటూరు కారం' మళ్ళీ మొదలైంది, బర్త్ డే తప్ప పెద్దగా బ్రేకులు లేకుండా! Guntur Kaaram new schedule starts today Mahesh Babu joins the shoot Guntur Kaaram New Schedule : 'గుంటూరు కారం' మళ్ళీ మొదలైంది, బర్త్ డే తప్ప పెద్దగా బ్రేకులు లేకుండా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/24/838ce4cff8efc6a3cb2003af70b81b111687585626083313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). 'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్ విజయాల తర్వాత వాళ్ళిద్దరి కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. చిత్రీకరణ అంత సాఫీగా జరగడం లేదని, కథానాయికను మార్చారని... బోలెడు కబుర్లు! లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
శంకరపల్లిలో 'గుంటూరు కారం'
Guntur Kaaram Shooting Update : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' కొత్త షెడ్యూల్ ఈ రోజు స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని శంకరపల్లి ఏరియాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసమే భారీ సెట్ వేశారు. అయితే... ఇది చిన్న షెడ్యూల్ అని తెలుస్తోంది. ఇది ముగిసిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని భారీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారట.
మహేష్ బాబుతో పాటు నటుడు రఘుబాబు, నటి ఈశ్వరీ రావు తదితరులు 'గుంటూరు కారం' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హీరో ఇంటి సెట్ లో షూట్ జరుగుతోంది. ఆగస్టు 9న హీరో పుట్టినరోజు. అప్పుడు మేజర్ బ్రేక్ ఉంటుందని తెలిసింది. అది మినహా అక్టోబర్ నెలాఖరు వరకు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట.
Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?
పూజా హెగ్డే లేదని క్లారిటీ వచ్చిన తర్వాత
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల... ఇద్దరినీ హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకొన్నారు. చిత్రీకరణ అనుకున్న విధంగా సాగకపోవడం, షెడ్యూల్స్ ఆలస్యం అవుతూ ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమైంది. దాంతో 'గుంటూరు కారం' నుంచి బయటకు వచ్చారు. ఆమె లేదని క్లారిటీ వచ్చిన తర్వాత 'గుంటూరు కారం' చిత్రీకరణ చేయడం ఇదే.
Also Read : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!
త్రివిక్రమ్ లాస్ట్ రెండు సినిమాలు 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ'లో పూజా హెగ్డే నటించారు. 'గుంటూరు కారం' వీళ్ళ కలయికలో హ్యాట్రిక్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే... అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది.
మీ కడుపు మంట చల్లారడానికి మజ్జిగ ఫ్రీగా ఇస్తా! - తమన్
'గుంటూరు కారం' నుంచి సంగీత దర్శకుడు తమన్ కూడా తప్పుకొన్నారని, మహేష్ బాబు ఒత్తిడి చేయడంతో ఆయన్ను తీసేశారని కూడా వార్తలు వచ్చాయి. వాటిపై తమన్ చాలా ఘాటుగా స్పందించారు. అరటిపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివని, కడుపు మంట చల్లారుస్తుందని తొలుత ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. అందులో ''రేపటి నుంచి నా స్టూడియోలో బటర్ మిల్క్ (మజ్జిగ) స్టాల్ పెడుతున్నా. మజ్జిగను ఉచితంగా అందిస్తా. కడుపు మంట సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళకు స్వాగతం. మీ రోగాన్ని తగ్గించుకోండి. గుడ్ నైట్! నాకు చాలా పని ఉంది. నా సమయాన్ని వృథా చేయవద్దు. అలాగే, మీ సమయాన్ని వృథా చేసుకోకండి. అరటిపళ్ళు తిని ప్రశాంతంగా ఉండండి'' అని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)