Game Changer Advance Booking Day 1: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్... లేటుగా ఓపెన్ చేసినా టాప్ లేపేలా ట్రెండింగ్‌లో
Game Changer Box Office Day 1 Prediction: 'గేమ్ చేంజర్' విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పటికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? వంటివి చూస్తే...
Game Changer Box Office Collection Day 1: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. రామ్ చరణ్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వచ్చేటటువంటి స్ట్రాంగ్ ఏరియాల్లో ఒకటి అయిన తెలంగాణలో లేటుగా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరి, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఎన్ని కోట్ల గ్రాస్ రావచ్చు? వంటి విషయాల్లోకి వెళితే...
బుక్ మై షోలో గంట గంటకు పైపైకి సేల్స్!
బుక్ మై షోలో ప్రతి గంటకు అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ పెరుగుతున్నాయి. ఏవరేజ్ లెక్క చూస్తే... ప్రతి గంటకు ఆల్మోస్ట్ 30 వేల టికెట్లు సేల్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే... తెలంగాణలో పూర్తి స్థాయిలో గురువారం (జనవరి 9న) బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అది పరిగణనలోకి తీసుకుంటే... సేల్స్ బాగున్నట్టే. మరో వైపు జొమాటోకి చెందిన డిస్ట్రిక్ యాప్ (District by Zomato)లో కూడా సేల్స్ చాలా బావున్నాయి. పేటీఎంలోనూ ట్రెండ్ బావుంది.
Also Read: 'గేమ్ చేంజర్' విడుదల తర్వాతే... కమల్ 'ఇండియన్ 3' రిలీజ్, రూమర్స్ మీద శంకర్ అప్డేట్
Conquering Collections🔥
— Milagro Movies (@MilagroMovies) January 9, 2025
Like a King 👑
Book your tickets now ✨#GameChanger#GameChangerOnJAN10 🚁 pic.twitter.com/T3rT3Anr48
మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది?
గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 40 కోట్లు దాటింది. సాయంత్రానికి డబుల్ డిజిట్ (100 కోట్లు) దాటే అవకాశం ఉంది. హిందీలో ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు వచ్చాయి. 'దేవర'కు మొదటి రోజు రూ. 7.50 కోట్లు వచ్చాయి. అది దాటుతుందో? లేదో? చూడాలి. అక్కడ ట్రెండ్ చూస్తుంటే మొదటి రోజు రికార్డులు కొట్టేలా ఉంది.
'గేమ్ చేంజర్' విడుదలకు ముందు శంకర్ దర్శకత్వం వహించిన 'ఇండియన్ 2' ఆశించిన విజయం రాలేదు. అయినా సరే 'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ బావున్నాయంటే కారణం రామ్ చరణ్ క్రేజ్ అని చెప్పాలి. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. తెలుగు అమ్మాయి అంజలి మరొక హీరోయిన్. సూర్య విలన్ రోల్ చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు చేశారు.
The Maverick @shankarshanmugh
— Game Changer (@GameChangerOffl) January 9, 2025
sir and our sound designer @Udaykumar_Mix after the final mix of #GameChanger 😎
Locked and Loaded! 🎯✊🏼💥
See you at Cinemas from Tomorrow ❤️#GameChangerOnJan10 🚁 pic.twitter.com/RC6XmTQuDr