Raj Taraun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ - హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కూడా కేసు.. ఏ1గా రాజ్, ఏ2గా మాల్వీ
Case Filed on Raj Tarun and Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లావణ్య ఆధారాల మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Case Filed on Raj Tarun and Heroine Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్‌తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడుపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్‌ని చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చీటింగ్ కేసు
రాజ్ తరున్ ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య జూలై 5న నార్సింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు చూపించాలంటూ పోలీసులు ఆమెకు తిరిగి నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలను నిన్న(జూలై 10) పోలీసులకు అందించింది. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. రాజ్ తరుణ్‌తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, కొంతకాలానికి రాజ్ తరుణే తనని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడంది.
అబార్షన్ చేయించాడు..
అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నామని, 2014లో తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది. ఈ విషయం తమ రెండు కుటుంబాలకు తెలుసని కూడా స్పష్టం చేసింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం ఆదుకుందని, ఇప్పటి వరకు రాజ్‌కి రూ. 70 లక్షల వరకు డబ్బుల ఇచ్చామంది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్‌తరుణే అబార్షన్ చేయించాడని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. అలాగే కావాలనే తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని, తాను జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి రాజ్ తరుణ్ తనని అవైయిడ్ చేస్తున్నాడని వాపోయింది. హీరోయిన్‌తో మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, రాజ్ వదిలేయాలని మాల్వీతో పాటు ఆమె సోదరుడు కూడా తనని బెదిరంచారంటూ ఆమె ఆరోపించింది.
ఇక లావణ్య ఆరోపణలపై వెంటనే స్పందించిన రాజ్ తరుణ్ ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు తనకు రిలేషన్ ఉన్న మాట నిజమే అని, కానీ తనకు ఉన్న అలవాట్ల వల్ల ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న ఆమెతో ఎలాంటి సంబంధం లేదని, తనతో అసలు శారీరక సంబంధమే లేదన్నాడు. అంతేకాదు లావణ్యకు డ్రగ్స్, సిగరేట్, మందు అలవాటు ఉందని, ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే మస్తాన్ సాయి వ్యక్తితో సహజీవనం కూడా చేస్తుందని, అతడు తనని పెళ్లి చేసుకోవాలని గుంటూరు పోలీసు స్టేషన్‌లో కూడా కేసు పెట్టిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇలా ఈ కేసులో ఎన్నో ట్విస్ట్‌లు నెలకొనగా ఫైనల్‌గా పోలీసులు లావణ్యా ఇచ్చిన ఆధారాలు మేరకు రాజ్ తరుణ్, మాల్వీపై కేసు నమోదు చేశారు.
Also Read: 'సారంగ దరియా' ఫస్ట్ రివ్యూ - ట్రాన్స్‌జెండర్స్ మీద సెన్సిటివ్ టాపిక్ టచ్ చేస్తూ...