![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Deverakonda: సోషల్ మీడియాని ఊపేస్తోన్న ఫ్యామిలీ స్టార్' డైలాగ్ - స్పందించిన విజయ్ దేవరకొండ
Airaneyvanchalaenti: 'ఫ్యామిలీ స్టార్' గ్లిమ్స్ లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ ని కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
![Vijay Deverakonda: సోషల్ మీడియాని ఊపేస్తోన్న ఫ్యామిలీ స్టార్' డైలాగ్ - స్పందించిన విజయ్ దేవరకొండ Family Star Vijay Deverakonda’s optimistic reaction to trolls becomes an internet sensation Vijay Deverakonda: సోషల్ మీడియాని ఊపేస్తోన్న ఫ్యామిలీ స్టార్' డైలాగ్ - స్పందించిన విజయ్ దేవరకొండ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/26/4f5b968f48547a83621d472d0c847c161698316525739753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'(Family Star) నుంచి ఇటీవల విడుదలైన గ్లిమ్స్ లో ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ అవుతుంది. కొంతమంది నెటిజన్స్ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. రీసెంట్ గా సమంతతో కలిసి 'ఖుషి'(Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో విజయ్ - సమంత మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఖుషి ఇచ్చిన జోష్ తో ఇప్పుడు 'గీత గోవిందం' మూవీ డైరెక్టర్ పరశురాంతో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ గ్లిమ్స్ లో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అవుతుంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. 'ఐరనే వంచాలా ఏంటి?' గ్లిమ్స్ లో.." లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడానికి, టైంకి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే" అని విలన్ ఎగతాళి చేస్తుంటాడు. దానికి విజయ్ దేవరకొండ బదులిస్తూ.. "భలే మాట్లాడతారన్న మీరంతా.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా, ఐరనే ఉంచాలా ఏంటి? అంటూ చాలా కూల్ గా చెబుతాడు.
దీంతో ఈ డైలాగ్ ఇప్పుడు తెగ ఫేమస్ అయిపోయింది. చాలామంది నెటిజన్స్ ట్విట్టర్లో ఐరనే వంచాలా ఏంటి? (#Airaneyvanchalaenti) అనే హ్యాష్ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఈ డైలాగ్ నచ్చిందని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే మరి కొంతమంది మీమర్స్ మాత్రం ఈ డైలాగ్ ని ట్రోల్ చేస్తూ రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ మీమ్స్ కాస్త విజయ్ దేవరకొండ వరకు వెళ్లాయి. స్వయంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా ఈ డైలాగ్ పై ఓ పోస్ట్ పెట్టారు." ఇంటర్నెట్ లో అసలు ఏం నడుస్తుంది" అనే క్యాప్షన్ పెడుతూ ఓ పోస్ట్ ని షేర్ చేశాడు. ఆ పోస్ట్ సైతం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే తన డైలాగ్ ని చాలామంది మీమర్స్ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నా విజయ్ దేవరకొండ మాత్రం ఎంతో స్పోర్టివ్ గా తీసుకోవడం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి ట్విట్టర్లో ఎక్కడ చూసినా 'ఐరనే వంచాల ఏంటి?' అనే డైలాగ్ అయితే తెగ ఫేమస్ అవుతోంది. 'గీతా గోవిందం' వంటి బ్లాక్ మాస్టర్ తర్వాత పరుశురాం - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా రాబోతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
Also Read : 'స్కంద' ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ - కారణం ఏమిటంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Going with the trend 😂#AiraneVanchalaEnti 🏃 pic.twitter.com/Rn0yCjHAaB
— degreetillu (@degreetillu) October 26, 2023
Chitti Robo version 😁😁#AiraneVanchalaEnti #VijayDeverakonda #FamilyStar @VDTrendsOffl pic.twitter.com/V2PhTvapgh
— Bharath valmiki (@BHARATHVALMIKI0) October 26, 2023
Intha Erripuku edit ni leparu ante mamulu haterd kadhu VD midha
— JuLaYiᴬᴬ🪓 (@JuLaYiAADHF) October 26, 2023
Congratulations Star Hero ayyavu @TheDeverakonda Welcome to tier 1 club https://t.co/ss1jSc7B46
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)