అన్వేషించండి

'ఈ నగరానికి ఏమైంది' రీ-రిలీజ్ కలెక్షన్స్ - ఫస్ట్ రిలీజ్ కన్నా 4 రెట్లు ఎక్కువ!

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ అభినవ్ గోమటం, వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'ఈ నగరానికి ఏమైంది' తాజాగా రీ రిలీజ్ లో అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంది.

'పెళ్లిచూపులు' అనే సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మొదటి సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాని  తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2018 జూన్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చి ఐదేళ్లయిన ఇప్పటికీ ఈ సినిమా చాలామందికి ఫేవరెట్. అప్పట్లో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినా, చాలామంది థియేటర్స్ లో ఈ సినిమా చూడలేకపోయారు. అందుకే సినిమా రిలీజై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. జూన్ 29న రీ రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ లో దుమ్ము లేపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సిటీస్ లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.

దీంతో సినిమా ఫస్ట్ రిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సాధించినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. దీన్నిబట్టి ఈ సినిమాకి యూత్ లో ఇప్పటికీ ఓ రేంజ్ లో క్రేజ్ ఉందని స్పష్టమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద హైదరాబాదులో మార్నింగ్ షోకి రూ.20 లక్షలు వసూలు చేసింది. అదే తాజాగా రీరిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద అదే హైదరాబాదులో మార్నింగ్ షోకి ఏకంగా రూ.80 లక్షలు వసూళ్లు రాబట్టింది. అంటే అప్పటి కలెక్షన్స్ తో పోలిస్తే 4 రెట్లు ఎక్కువగా రీ రిలీజ్ లో ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమా రీ రిలీజ్ కి ఎవరూ ఊహించిన విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాదులో అదే రోజు అంటే జూన్ 29న రెండు కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ దాదాపు అన్ని షోలు అమ్ముడయ్యాయి. అంతేకాదు ఈ సినిమాకు ఉన్న డిమాండ్ చూసి నిర్మాతలు ఇప్పుడు మరిన్ని షోలు కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం మరియు వెంకటేష్ కాకుమాను ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించగా, సిమ్రాన్ చౌదరి మరియు అనీషా ఆంబ్రోస్ కథానాయికలుగా నటించారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్ల్లో నటించిన విశ్వక్ సేన్ ఇప్పుడు అగ్ర హీరోగా టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే అభినవ్ గోమటం కమెడియన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక సాయి సుశాంత్ ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోలో కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే వెంకటేష్ కాకుమాను ఇప్పటికే కొన్ని సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్నాడు.

Also Read : బార్‌లో ఒకే సిట్టింగ్‌తో ఆ డైరెక్టర్‌తో మూవీకి ఓకే చెప్పేసిన అల్లరి నరేష్ - అనౌన్స్‌మెంట్ వీడియో అదుర్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget