By: ABP Desam | Updated at : 18 Sep 2023 08:39 AM (IST)
దుల్కర్ సల్మాన్ (Image Credit: X)
'సీతారామం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త'. ఆగస్టు 24న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని అందరూ భావించారు. కానీ ఇది ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ దిశగా పయనించింది. అయితే వెండితెర మీద మెప్పించలేకపోయిన ఈ చిత్రం.. డిజిటల్ వేదికపై అలరించడానికి రెడీ అవుతోంది.
'కింగ్ ఆఫ్ కొత్త' సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ డిస్నీ + హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ లాక్ చేయబడింది. సెప్టెంబర్ 22వ తేదీ నుండి హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
Also Read: కల్కి 2898 AD లీక్ - నష్టపరిహారం కోసం VFX కంపెనీపై కేసు నమోదు చేసిన మేకర్స్?
1980స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త'. కొత్త అనే కల్పిత పట్టణంలో ఈ కథ జరుగుతుంటుంది. తండ్రిలా రౌడీ అవ్వాలనుకున్న రాజు అనే కుర్రాడు తన కల నెరవేర్చుకునేందుకు ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ప్రేమ, స్నేహం విషయాల్లో ఎలాంటి ఎదురు దెబ్బలు తిన్నాడు? అనేది ఈ సినిమా కథాంశం. ఇందులో యాక్షన్ తో పాటుగా లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్, డ్రామా అన్నీ మేళవించే ప్రయత్నం చేసారు. కాకపోతే దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడం, ఏ ఒక్క ఎమోషన్ ను పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురాలేకపోవడం నిరాశ పరుస్తుంది.
'కింగ్ ఆఫ్ కొత్త' చిత్రంలో గ్యాంగ్ స్టర్ రాజుగా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఆకట్టుకుంది. ఓకే బంగారం, మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం చిత్రాలతో అలరించిన నటుడు.. మాస్ రోల్ లో మెప్పించాడు. ఆయనకు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. సర్పట్ట ఫేమ్ డ్యాన్సింగ్ రోజ్ అకా షబీర్ కల్లారక్కల్, ప్రసన్న, అనిఖా సురేంద్రన్, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రితికా సింగ్ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.
'కింగ్ ఆఫ్ కొత్త' సినిమాని డెబ్యూ డైరెక్టర్ అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. ZEE స్టూడియోస్ సమర్పణలో దుల్కర్ సల్మాన్ హోమ్ ప్రొడక్షన్ వేఫేరర్ ఫిల్మ్ బ్యానర్ లో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ మూవీ, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
Also Read: 'సో స్వీట్ ఆఫ్ యూ..' బన్నీ ట్వీట్ కి నయన్ స్పందన ఇదే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
/body>