Kaantha Movie: దుల్కర్ సల్మాన్ - రానా కొత్త మూవీ షురూ... హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ
రానా, దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ‘కాంత‘ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్ గా ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ సెలెక్ట్ అయ్యింది.
Kaantha Movie Launched: మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్కాన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అక్టోబర్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పేశారు దుల్కర్ సల్మాన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కాంతా‘ అనే సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. వెంకీ తొలి సీన్ కు క్లాప్ కొట్టారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి నటీనటులతో పాటు పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ పూజా కార్యక్రమకాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
పీరియాడిక్ డ్రామా రూపొందనున్న ‘కాంత‘
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కాంత‘ సినిమాను 1950లో మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో హీరో రానా కీలక పాత్ర పోషించబోతున్నారు. మరో ముఖ్య పాత్రలో సముద్రఖని కనిపించనున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ రూపొందనుంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సాయికృష్ణ గద్వాల్, లైన్ ప్రొడ్యూసర్ గా శ్రవణ్ పాలపర్తి, DOPగా డాని శాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్టర్ రామలింగం వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ్ ప్రభు రచయితగా కొనసాగుతుండగా, జాను సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్ గా లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్స్ గా పూజిత తాడికొండ, సంజన శ్రీనివాస్ ఉన్నారు.
#Kaantha Pooja Ceremony Happening Now! 🤍✨
— AB George (@AbGeorge_) September 8, 2024
Bankrolled by @DQsWayfarerFilm @SpiritMediaIN !! 🔥#DulquerSalmaan - #RanaDaggubati - #BhagyashriBorse! 📸@dulQuer@RanaDaggubati pic.twitter.com/stv8ckgZLw
హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ
‘కాంత‘ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. తాజాగా ప్రతిష్టాత్మక చిత్రంలో అవకాశం అందుకుంది. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టిన ఈ మరాఠీ బ్యూటీ.. పలు యాడ్స్ లో నటించింది. ‘మిస్టర్ బచ్చన్‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో ‘జిక్కీ‘ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె యాక్టింగ్ చూసి ప్రేక్షకులతో పాటు మేకర్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ‘కాంత‘ సినిమాలో ఛాన్స్ పొందింది.
‘సీతారామం‘తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. దుల్కర్ మలయాళంలో నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్బై విడుదల అయ్యాయి. ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ‘మహానటి‘ సినిమాలో శివాజీ గణేషన్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ‘సీతారామం‘ సినిమాతో తెలుగులో నేరుగా సినిమా చేశారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజిలో అద్భుత విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడీ‘లోనూ కనిపించారు. అంతేకాదు, ‘లక్కీ భాస్కర్’ అనే తెలుగు సినిమా చేస్తూనే, ఇప్పుడు ‘కాంత‘ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'