Director Trinadha Rao Nakkina: టాలీవుడ్‌లో మరో విషాదం - స్టార్ డైరెక్టర్ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ ధమాకా సినిమాతో ఇండస్ట్రీకి వందకోట్ల గ్రాస్ మూవీ అందించిన ఆయన ప్రస్తుతం మెగా హీరో సినిమాతో బిజీగా ఉన్నారు.
Director Trinadha Rao Nakkina Father Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి నక్కిన సూర్యారావు గారు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నేడు వారి స్వగ్రామం అనకాపల్లిలో ఆయన అంత్యక్రియలు చేయబోతున్నట్టు సమాచారం. దీంతో సినీ ప్రముఖులు,నటీనటులు సోషల్ మీడియాలో వేదికగా త్రినాధరావు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. పలువురు స్వయంగా ఇంటికి వెళ్లిన త్రినాధరావు తండ్రి భౌతికకాయానికి నివాళ్లులు అర్పిస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి చెందిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంపై మక్కువ హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో 2013లో ప్రియతమా నివచట కుశలమా అనే సినిమాతో డైరెక్టర్‌గా సిరీరంగా ప్రవేశం చేశారు. అలా పలు చిత్రాలు చేసిన ఆయన రాజ్ తరుణ్ 'సినిమా చూపిస్తా మామ' సినిమాతో తొలి హిట్ అందుకున్ఆనరు. ఆ తర్వాత నాని-కీర్తి సురేష్ నేను లోకల్ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన రామ్ పోతినేని హలో గురు ప్రేమకోసమే సినిమా తీశారు.
ఇది ఆశించిని విజయం అందుకోలేదు. ఇక త్రినాధరావు నక్కిన చివరిగా ధమాకా సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మెగా హీరో వరుణ్ తేజ్‌తో మట్కా మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ అట. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా వరుస సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళుతున్న ఆయన తండ్రి మరణంతో శోకసంద్రంలోకి వెళ్తారు. దీంతో ఆయనకు, కుటుంబసభ్యులు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read: 'బర్ఫీ' హిట్‌తో సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యా - ఆ దర్శకనిర్మాత వల్లే తెలుగులో ఆఫర్స్ రాలేదు