Vishwak Sen: మనిషి స్పర్శ తాకితే ఏమవుతుంది? ఆసక్తికర విషయాలు చెప్పిన ‘గామి’ డైరెక్టర్
Vishwak Sen Gaami Movie: 'గామి'.. విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా టీజర్ అంచనాలను పెంచేస్తోంది. అఘోరాగా కనిపిస్తున్న విశ్వక్ సేన్ భయపెడుతున్నాడు. ఆ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.
Vishwak Sen Gaami Movie: మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మంచి మంచి కథలు ఎన్నుకుంటూ, నచ్చిన చిత్రాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన నటించిన 'గామి' సినిమా మరింత డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా చేశారు. ఆయన ఫస్ట్ లుక్ అందరినీ భయపెట్టించేసింది. ఇక ఇప్పుడు టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది. సరికొత్త జానర్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డైరెక్టర్.
ఆధ్యాత్మికం కాదు.. సైన్స్ కాదు అంతకుమించి
విశ్వక్ సేన్ ఒక మాస్ హీరో, ఆయనతో ఇలాంటి సినిమా చేయడం ప్రయోగమే కదా? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు డైరెక్టర్ విద్యాధర్. విశ్వక్ సేన్ చాలా టాలెంటెడ్. "ప్రతి సినిమా మాస్ గా చేస్తాడు కాబట్టి ప్రేక్షకులకు తొందరగా రీచ్ అయ్యింది. నిజానికి ఆయన అద్భుతమైన టాలెంట్ ఉన్న యాక్టర్. అందుకే, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాని కూడా ఆదరిస్తారు. ఇక ఈ సినిమాలో ఫిలాసఫీ గురించి వస్తే.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది థియేటర్ లో చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో అఘోరాల గురించి ఎక్కువ చెప్పలేదు. కేవలం మనిషి స్పర్శ గురించి. మానవ స్పర్శ దాని చుట్టూ ఉన్న ఎమోషన్స్ గురించి చెప్పాం" అని అన్నారు.
హీరోయిన్ లుక్ గురించి రిపోర్ట్ లు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు ఆయన. "ఈ సినిమాలో సైన్స్, రిలీజియన్ గురించి కాదు. ఒక కొత్త కాన్సెప్ట్ గురించి. అది మీరు కచ్చితంగా సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అందరిలో ఇలాంటి క్యూరియాసిటీ కనిపించేందుకే హీరోయిన్ లుక్ ని రిలీజ్ చేశాం. కచ్చితంగా ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్" అని చెప్పారు విద్యాధర్. ఇక ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ని బాగా నమ్మానని, ఆయన మీద ఉన్న నమ్మకంతోనే కథకు ఓకే చెప్పానని విశ్వక్ చెప్పారు.
కొత్త డైరెక్టర్ తో.. కొత్త కాన్పెప్ట్
విశ్వక్ సేన్ అంటే.. ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆయన మాస్ సినిమాలు. అందుకే ఆయన్ను మాస్ కా దాస్ అని పిలుస్తారు అభిమానులు. అలాంటిది ఇప్పుడు సరికొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆయన. ఇక ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్ విద్యాధర్ కి కూడా ఇది ఫస్ట్ సినిమా. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కొత్తగా వచ్చిన ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ డేట్ చేసుకున్నారు మేకర్స్. మార్చి 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
ఇక ఈ సినిమాలో కలర్ ఫొటో' ఫేం చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎం జి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్ రీసెంట్‌గా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తీస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ఊరమాస్ లో కనిపించబోతున్నారు. గోదావరి బ్యాగ్రౌండ్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Also Read: ‘బిగ్ బాస్ 7 ఉత్సవం’లో కుమారి ఆంటీ - అక్కడ కూడా అదే పని!