అన్వేషించండి

Ramgopal Varma : నాకు నేనే చెప్పుకుంటా - జగన్‌కు వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన ఆర్జీవీ

RGV : సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వైయస్ జగన్ బర్త్ డే సందర్భంగా మీడియా వేదికగా ఆయనకు తనదైన శైలిలో విషెస్ తెలిపారు.

Director Ramgopal Varma Birthday Wishes To CM Jagan : ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ఏడాదితో ఆయన 51 ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కి వైయస్సార్సీపి కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. మరోవైపు సీఎం జగన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా వేదికగా సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తనదైన స్టైల్ లో విషెస్ చెప్పారు.

"వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సాధారణంగా నేను హ్యాపీ బర్త్డే ఎవరికీ చెప్పను. కానీ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన  ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ వైఎస్ జగన్. ‘వ్యూహం’ సినిమా తీయడానికి కూడా ఆయనే నాకు ఇన్స్పిరేషన్. సో ఆయన జన్మదినం కన్నా ఈ సినిమా తీసినందుకు నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను" అంటూ తెలిపారు రాంగోపాల్ వర్మ. దీంతో జగన్ బర్త్ డే సందర్భంగా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై రాంగోపాల్ వర్మ 'వ్యూహం' అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా పొలిటికల్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందని చెప్తూ.. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వ్యూహం’తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటించిన అజ్మల్ అమీర్.. ఇందులో కూడా అదే పాత్ర చేస్తున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో పాటూ వైయస్ జగన్ రాజకీయ జీవితంపై 'యాత్ర 2' మూవీ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే కావడంతో ‘యాత్ర 2‘కు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో వైఎస్సార్‌గా మమ్ముట్టి కనిపించగా.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగా జీవా వైట్ అండ్ వైట్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

Also Read : ‘డంకీ’ అడ్డుకున్నా డైనోసర్‌దే పైచేయి, బుకింగ్స్‌లో అదుర్స్ అనిపిస్తోన్న ‘సలార్’ - అప్పుడే అన్ని టికెట్లా!

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun - National Awards 2026: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ... నేషనల్ అవార్డుల్లో బన్నీకి బెస్ట్ యాక్టర్‌ ఎందుకు రాలేదంటే?
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Chiranjeevi On Vikram 1: విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు
విక్రమ్ 1 విజయంపై చిరంజీవి ట్వీట్... పీఎం మోడీ, పవన్ కళ్యాణ్ సైతం... స్కైరూట్‌కు అభినందనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget