తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేపట్టిన బాధ్యతలు దిగ్విజయంగా సాగాలని, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆమె శ్రీవారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. భక్తిశ్రద్ధలతో తిరుమల కొండకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు.