భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్కు చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్' సృష్టించిన చరిత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'నా నమ్మకం నిలిచింది.. మన యువత తమ ప్రతిభను నిరూపించింది' అని ఆయన కొనియాడారు. స్టార్టప్ సంస్థలు అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వాములు కావడం ద్వారా భారత్ సాధిస్తున్న ప్రగతిని ఆయన అభినందించారు.