Director Meher Ramesh: 'శక్తి' సినిమా కథ నాకే అర్థం కాలేదు, స్టోరీ మార్చడంతో క్రాస్ బ్రీడ్ సినిమా అయిపోయింది - డైరెక్టర్ మెహర్ రమేశ్
Director Meher Ramesh: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి షాక్ ఇచ్చిందో తెలిసిందే. అయితే, ఆ సినిమా గురించి సంచలన విషయాలు చెప్పారు డైరెక్టర్ మెహర్ రమేశ్.
Director Meher Ramesh Reveals Real Story Of Shakthi Movie: 'శక్తి' సినిమా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈసినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. భారీ బడ్జెట్ తో, భారీ విజువల్స్ తో సినిమా తీసినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే, ఆ సినిమాకి సంబంధించి కొన్ని సంచలన విషయాలు చెప్పారు డైరెక్టర్ మెహర్ రమేశ్. సినిమా కథ అసలు అది కాదని, ముందు రాసుకున్న కథని తర్వాత మార్చేశారని అన్నారు. కానీ, కథ ఏదైనప్పటికీ తాను విజువలైజేషన్స్ పరంగా చాలా బాగా తీశానని చెప్పుకొచ్చారు. ఆయన గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.
'శక్తి' అసలు కథ ఇది..
"శక్తి' సినిమా చాలా దేశాలు తిరిగాం, చాలా చోట్ల షూట్ చేశాం. కానీ, దత్ గారికి బడ్జెట్ పరంగా చాలా కలిసొచ్చింది. కారణం.. నేను 30 రోజులు లైట్స్ లేకుండా, జనరేటర్ లేకుండా చేశాం. నేను చాలా బెస్ట్ డిజైనర్ ఎక్కడ బడ్జెట్ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చాలా డిజైన్ చేసుకుంటాను నేను. కానీ, ఆడియెన్స్‌కు ఎక్కలేదు. ఎందుకంటే ‘శక్తి’ సినిమా మొదలైంది ఆ కథతో కాదు. ఒక గైడ్ ఉంటాడు, హోం మినిస్టర్ కూతురిని కాపాడతాడు. కానీ, కాపాడింది గైడ్ కాదు కమాండో. సెకెండ్ ఆఫ్ లో లవ్ స్టోరీ ఉంది. ఎన్టీఆర్ కి చెప్పింది, దత్ గారికి చెప్పింది, ఆడ్వాన్స్ తీసుకుంది ఆ కథ గురించే."
కథ ఎందుకు మారిందంటే?
"అదే టైంలో ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమా చేస్తున్నారు. దాంతో మా సినిమాకి గ్యాప్ వచ్చింది. అప్పుడు దత్ గారు ఒక ఐడియా ఇచ్చారు. మేం కూడా ఆయన ఐడియా వర్క్ అవుట్ అవుతుందని ఫీల్ అయ్యాం. అలా ఈ సినిమా సోషియో ఫ్యాంటసీలా, డివైన్ ఎలిమెంట్ తో వచ్చింది. ఆయన కొంతమంది రైటర్లను ఇచ్చారు ఎండమూరి వీరేంద్రనాథ్, కొంతమంది పండితులను పరిచయం చేశారు. అలా నాకు తెలియని ఒక జోనర్ లోకి తీసుకెళ్లారు. దాంతో అదొక క్రాస్ జండర్ ఫిలిమ్ అయిపోయింది. నేను అప్పుడు ఇది వద్దు ఇది వేరే కథగా చేద్దాం. నాకే అర్థం కావడంలేదు అని చెప్పాను. ఏ సినిమా ఆడకూడని సినిమా చేయం కదా. ఇది బాగానే ఉంటుంది నమ్ము అని అన్నారు. పెద్దవాళ్ల సలహా, పెద్ద రైటర్లు ఉన్నారు. సరే క్రాస్ జండర్ అయినా మేకింగ్ దగ్గర చూసుకుందాం అనుకున్నాను. అందుకే విజువల్స్ పరంగా చాలా బెస్ట్ గా తీశాను. కానీ, ఆ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా, సెకెండ్ హాఫ్ అంతా ఒకలా అయిపోయింది. ‘బిల్లా’ ఎలా అయితే అందరం మంచి కలెక్టివ్ గా చేసి.. మంచి రిజల్ట్ తెచ్చామో.. అలా ఇది అందరం కలెక్టివ్ గా పంక్చర్ చేశాం. కానీ, అందరూ డైరెక్టర్ ని మాత్రమే అంటారు. దాన్ని నవ్వుతూ తీసుకుంటాను" అని మెహర్ రమేశ్ చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'శక్తి'. 2011లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. దానికి మెహర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Also Read: మంచి మనసు చాటుకున్న చియాన్ విక్రమ్, వయనాడ్ బాధితులకు అండగా నిలిచిన ‘తంగళన్‘ నటుడు