Director Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘లియో’ దర్శకుడు లోకేష్ కనగరాజ్
‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో వరుస హిట్ట్‌లతో దూసుకెళ్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.. కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు.
Lokesh Kanagaraj New Production Venture G Squad : తక్కువ సినిమాలే తీసినా దక్షిణాదిలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. కేవలం 5 సినిమాలతో బాక్సఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించాడు. కోలీవుడ్ నటులు విజయ్, కమల్‌హాసన్, కార్తీ తదితరులతో సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకోనున్నట్లు వెల్లడించాడు. ‘జీ స్క్వాడ్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు.
కొత్తగా సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి కథలు రెడీ చేసిన వారికి తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. అయితే మొదట తన స్నేహితులు, సన్నిహితులతో పాటు అసిస్టెంట్లకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వారిలోని క్రియేటివ్ ఐడియాస్‌ను ప్రోత్సహించి వారిని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి రానున్న ఫస్ట్ అప్డేట్ కోసం ఎదురు చూడాలని సూచించారు. ఎప్పటిలాగే అందరూ తనకు సహకారం అందించాలని లోకేష్ కనగరాజ్ కోరారు.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. ఇటీవల విడుదలైన విజయ్ ‘లియో’ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. గతంలో తాను డైరెక్షన్ చేసిన సినిమాల్లోని క్యారెక్టర్లకు సినిమాటిక్ కాన్సెప్ట్‌తో లింక్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త రకమైన థ్రిల్‌ను పరిచయం చేశాడు. రజనీకాంత్‌తో చేయనున్న క్రేజీ ప్రాజెక్టు కోసం ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన కథకు ఆయన తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ మూవీలో రజనీ పవర్‌ఫుల్ డాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ కీ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం.
మరోవైపు టాలీవుడ్‌లో డైరెక్ట్ మూవీ చేసేందుకు లోకేష్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రభాస్‌తో జత కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్‌గా ఇటు లోకేష్, కార్తి ‘ఖైదీ’ సూపర్ సక్సెస్‌ను అందుకున్నాయి. విక్రమ్, ఖైదీ సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని ఆ మధ్య లోకేశ్ ప్రకటించి ఆయా మూవీలపై మరింత ఆసక్తికి రేకెత్తించారు. లేటెస్ట్‌గా మరోసారి విజయ్‌తో తీసిన ‘లియో’ కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఆ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటి వరకు కేవలం కోలీవుడ్‌కే లోకేష్ పరిమితమైనా.. ఆయన చేసిన సినిమాలు మాత్రం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలనూ ఆకర్షిస్తున్నాయి. దక్షిణాదిలోనే కాకుండా అటు బాలీవుడ్‌లోనూ ఆయనకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్లతో లోకేష్ ఓ మల్టీస్టారర్ ప్లాన్‌చేస్తున్నారట. మరో విషయం ఏంటంటే.. కేవలం 10 సినిమాలు మాత్రమే చేసి డైరెక్షన్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఓ సందర్భంగా ఆయన చెప్పారు. ఇప్పటికే ఐదు సినిమాలు పూర్తిచేసిన లోకేష్.. రజనీతో తీసే చిత్రంతో పాటు విక్రమ్, ఖైదీ సీక్వెల్స్‌తో మూడు చిత్రాలు లోకేష్ చేతిలో ఉన్నాయి.
Also Read : 'ఆర్య 2'కి 14 ఏళ్లు - బన్నీ ఎమోషనల్ పోస్ట్!