Sequel To Ram Warriorr: రామ్ 'వారియర్'కు సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన 'ది వారియర్' జూలై 14న విడుదలవుతోంది. సినిమా భారీ విజయం సాధిస్తుందని యూనిట్ ధీమాగా ఉంది. సీక్వెల్ తీయాలని సన్నాహాలు కూడా చేస్తున్నారు.
![Sequel To Ram Warriorr: రామ్ 'వారియర్'కు సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ Director Lingusamy confirms sequel to Ustad Ram Pothineni's Action Entertainer The Warriorr Sequel To Ram Warriorr: రామ్ 'వారియర్'కు సీక్వెల్ - కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/02/f4fb104962bc0298d5442bae8c409d8a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'ది వారియర్'... ఉస్తాద్ రామ్ పోతినేని (Ustad Ram Pothineni) కథానాయకుడిగా నటించిన సినిమా. ఈ నెల 14న విడుదల అవుతోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ సత్య పాత్రలో నటించారు. ట్రైలర్ చూస్తే... మాసీ యాక్షన్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. లుక్ నుంచి యాటిట్యూడ్ వరకు కొత్త రామ్ కనిపించారు. నయా ఖాకి గిరి చూపించారు. అది కంటిన్యూ కానుంది.
'ది వారియర్' (The Warriorr Telugu Movie) ఘన విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఆల్రెడీ విడుదలైన 'బుల్లెట్...', 'విజిల్...' సాంగ్స్‌కు ఛార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. శుక్రవారం రాత్రి ట్రైలర్ విడుదల చేశారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు యూనిట్ మంచి జోష్‌లో ఉంది. సినిమా విడుదలకు ముందే సీక్వెల్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
Sequel To The Warriorr: దర్శకుడు లింగుస్వామికి 'ది వారియర్' స్ట్రెయిట్ తెలుగు సినిమా. దీని తర్వాత తెలుగు సినిమాలు చేయాలని ఉందని, 'వారియర్'కు సీక్వెల్ చేస్తానని ట్రైలర్ లాంఛ్‌లో ఆయన చెప్పారు. ఆయనపై రామ్ పోతినేనికి మంచి అభిప్రాయం ఉంది. తాను కలిసిన జెన్యూన్ పర్సన్స్‌లో లింగుస్వామి ఒకరని హీరో చెప్పారు.
''మంచి మనసున్న మనిషి లింగుస్వామి. సినిమాలో ప్రతి ఎమోషన్ ఆయన జెన్యూన్‌గా ఫీలై చేసింది. తెలుగులో కమర్షియల్ హిట్స్ అయిన సినిమాల్లో సీన్లు లింగుస్వామి సినిమాల్లో సీన్లు చూసి స్ఫూర్తి పొందినవి. నాకు ఆయా దర్శకులు వచ్చి ఆ విషయం చెప్పారు'' అని ట్రైలర్ లాంఛ్‌లో రామ్ అన్నారు. తెలుగు ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి శ్రీను, తమిళ ట్రైలర్ విడుదల చేసిన శివ కార్తికేయన్‌కు థాంక్స్ చెప్పారు.
Also Read : రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్
Also Read : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)