Director Lakshmi Soujanya: నాకు తిక్క కొడతా అన్నారు - దర్శకుడు తేజాపై డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య కామెంట్స్
Lakshmi Soujanya: తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది. వాళ్లలో ఒకరే లక్ష్మీసౌజన్య. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ తర్వాత.. వరుడు కావలెను అనే సినిమా చేశారు సౌజన్య
Director Lakshmi Soujanya About Teja & Krishna Vamsi: తెలుగు ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే, వాళ్లలో ఎక్కువగా వినిపించే పేరు నందిని రెడ్డి ఆ తర్వాత లక్ష్మీ సౌజన్య. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ స్టార్ చేసిన ఆమె.. తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణ వంశీ తదితరులు దగ్గర పనిచేశారు. ఇక ఆ తర్వాత తన డైరెక్షన్ లో 'వరుడు కావలెను' సినిమా చేశారు ఆమె. అయితే, వివిధ డైరెక్టర్ల దగ్గర పనిచేసిన అనుభవాలను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు లక్ష్మీ సౌజన్య. కృష్ణ వంశీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పారు ఆమె.
తేజ స్ట్రాంగ్..
తేజకి చాలా కోపం, అని తిక్క అని అందరూ అనుకుంటారు కదా.. మీరు వర్క్ చేయడం ఎలా ఉంది అని అడిగిన యాంకర్ ప్రశ్నకి ఆమె ఈ విధంగా ఆన్సర్ చేశారు. "తేజ స్ట్రాంగ్ గా ఉంటారు. ఆయనకు అందరూ భయపడతారు. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు.. "తెలుసా నా గురించి. నాకు చాలా తిక్క.. కొడతాను" అని అన్నారు. దానికి నేను పని చేయకపోయినా కొడతారా? పని చేయకపోతే కొడితే తిక్క అనరు. ఏమీ చేయలేదని కొడితేనే తిక్క అంటారు. అయినా పర్లేదు చేస్తాను అన్నాను. పనిచేయగలను, ఉండగలను అన్నాను. సరే జాయిన్ అయిపో అన్నారు. జాయిన్ అయ్యాను. కాస్ట్యూమ్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఆరు మంది ఉండేవాళ్లు. 15 రోజులకు ఒకడు మానేశాడు, నెలకు ఇంకోడు మానేశాడు. అలా ముగ్గురమే అయ్యాము. నేను కాస్ట్యూమ్, కెమెరా, యాక్టర్స్ ప్లేస్ మెంట్ అన్నీ చూసుకునే దాన్ని. భలే మెచ్చుకునే వాళ్లు నన్ను. అక్కడ వర్క్ బాగా నేర్చుకున్నాను."
తీసేశారా? వచ్చేశావా? అన్నారు..
"తేజ దగ్గర సినిమా చేస్తున్నప్పుడు.. శేఖర్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ సినిమా పూర్తవుతుంది అనగా.. అక్కడికి వెళ్లాను. తేజ గారు అప్పటికే ఇంకో సినిమా ఒప్పుకున్నారు. చేస్తావా? అని కూడా అడిగారు. లేదు అని చెప్పి శేఖర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఈయన టేకింగ్ అంతా ఒకేలా ఉంటుంది కదా. కొత్తవాళ్ల దగ్గర అయితే స్కోప్ ఉంటుంది. శెఖర్ గారి దగ్గర చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్లాను. "తీసేశారా? వచ్చేశావా?" అని అడిగారు. మీరు పిలిచారని వచ్చాను. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను అన్నాను. "లేదులే జోక్ గా అన్నాను" అన్నారు శేఖర్ సార్.
ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను..
"శేఖర్ కమ్ములతో సినిమా చివర్లో ఉండగా.. కృష్ణ వంశీ నుంచి కాల్ వచ్చింది. చిన్ని అనే ఒక అమ్మాయి ఆయన దగ్గర మానేస్తూ నాకు ఫోన్ చేసి, "నువ్వు ఇక్కడ జాయిన్ అవుతావా?" అని అడిగింది. ఒకసారి డైరెక్టర్ గారిని అడిగి చెప్తాను అనింది. అప్పుడు కృష్ణ వంశీ ఇంటర్వ్యూ చేశారు. కానీ, నేను చూస్తాను.. మీ గురించి కొంచెం బయట సరిగ్గా లేదు. వేరేగా విన్నాను అన్నాను. "ముందు నువ్వు మాకు నచ్చాలి కదా" అని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడే బయటికి వెళ్లిపోతా అని చెప్పగానే లేదు ఫస్ట్ జాయిన్ అవ్వండి అని అన్నారు. ఇక జాయిన్ అయిన తర్వాత.. ఇప్పటికీ నా ఫేవరెట్ ఆయన. ఆయన వల్లే ఇక్కడి వరకు రాగలిగాను. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉంచింది. ఏదైనా నేర్చుకున్నాను అంటే కృష్ణ వంశీ గారి దగ్గరే" అని చెప్పారు డైరెక్టర్ సౌజన్య.
Also Read: జనాలను ఒప్పిస్తే తనే లీడర్ - విశాల్ పొలిటికల్ ఎంట్రీపై వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యలు